రాజధాని వివాదం రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసింది: పి.మధు

ఆంధ్రప్రదేశ్ కు రాజధాని వివాదం ఇప్పటికే రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసిందని సీపీఎం రాష్ర్ట కార్యదర్శి పి. మధు అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికైనా రాష్ర్ట ప్రభుత్వం అమరావతిలో తిరిగి నిర్మాణాలు ప్రారం భించి వేగంగా పూర్తి చేయాలని చెప్పారు. రాజధానిగా అమరా వతిని వివాదం చేయోద్దని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన తెలి పారు. ప్రజా ఆందోళనలతో కేంద్రంలోని బీజేపీ మూడు నల్ల చట్టా లను రద్దు చేయాలన్సి వచ్చిందని చెప్పారు. ఆంధ్రదప్రదేశ్‌ ప్రభుత్వం కూగా ప్రజాభిప్రాయానికి కట్టుబడి ఉండాలని సీపీఎం డిమాండ్‌ చేస్తోందని ఆయన వివరించారు. ప్రజలకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాల ఫలితంగా ప్రభుత్వాలు, ప్రజలు ఎంతో నష్టపోవాల్సి వస్తోందని ఆయన అన్నారు. రాష్ర్ట ప్రభుత్వం ఆలస్యం చేసినా మంచి నిర్ణ యం తీసుకుందని ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఆయన అన్నారు.

కొత్త బిల్లు ప్రవేశపెట్టిన అదికూడా ప్రజా ఆమోదం పొందితేనే మూడు రాజధానుల నిర్ణయం అమలవుతుందన్నారు. మోజార్టీ ప్రజలు మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నారని, వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలనుకుంటే రాజధాని నిర్ణయం ఒక్కటే కాదని, అవి అభివృద్ధి చెందడానికి ఇంకా ఎన్నో చేయోచ్చని ఆయన వ్యాఖ్యానిం చారు. ప్రభుత్వాలు ప్రజా పాలనను నిర్లక్ష్యం చేస్తే ప్రజా క్షేత్రంలో ప్రజలు తమ సమాధానం చెబుతారని ఏ ప్రభుత్వాలైన ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని మధు అన్నారు.

Related Articles

Latest Articles