రెండో రోజు ముగిసిన ఆట.. భారమంతా సీనియర్‌లపైనే..!!

కేప్‌టౌన్ టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది. మళ్లీ భారత ఓపెనర్లు దారుణంగా విఫలమయ్యారు. కేఎల్ రాహుల్ 10 పరుగులు, మయాంక్ అగర్వాల్ 7 పరుగులు మాత్రమే చేశారు. 24 పరుగులకే భారత్ రెండు వికెట్లు కోల్పోవడంతో పుజారా, విరాట్ కోహ్లీ ఆచితూచి ఆడారు. పుజారా 31 బంతుల్లో 9 పరుగులతో, కోహ్లీ 39 బంతుల్లో 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. రబాడ, మాక్రో జాన్సన్ తలో వికెట్ పడగొట్టారు.

కాగా ఈ టెస్టులో భారత్ గెలవాలంటే పుజారా, కోహ్లీ, రహానె, పంత్ బాధ్యతాయుతంగా ఆడాల్సి ఉంది. మూడో రోజు కనీసం టీ సెషన్ వరకు భారత్ ఆడితే ఆధిక్యం 250 పరుగులు దాటే అవకాశాలున్నాయి. ప్రస్తుతం భారత్ తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 13 పరుగులతో కలిపి మొత్తం 70 పరుగుల ఆధిక్యంలో ఉంది. సీనియర్లు రాణిస్తే బౌలర్లకు పని తేలిక కానుంది. ఎలాగైనా ఈ టెస్టును గెలిచి తొలిసారిగా టీమిండియా సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ గెలవాలని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు.

Related Articles

Latest Articles