కాన్స్ లో కళకళలాడిన కళాత్మక చిత్రాలు!

కరోనా భయాలు, కోవిడ్ జాగ్రత్తల నడుమ ప్రతిష్ఠాత్మక ‘కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్’ శనివారం ముగిసింది. నిజానికి 74వ ఎడిషన్ కాన్స్ ఫెస్టివల్ ఎప్పుడో జరగాలి. కానీ, మహమ్మారి నేపథ్యంలో వాయిదా పడుతూ వచ్చింది. అయితే, వైరస్ భయపెడుతున్నా కాన్స్ వేదిక మీదకి ఎప్పటిలాగే అద్భుతమైన సినిమాలు ప్రదర్శనకొచ్చాయి. ప్రతిష్ఠాత్మక పాల్మ్ డీ ఓర్ అవార్డు అందుకున్న ఉత్తమ చిత్రం సహా టాప్ టెన్ మూవీస్ ఎట్ కాన్స్ ని ఇప్పుడోసారి చూద్దాం… ‘టైటానే’ సినిమా అందరి దృష్టినీ ఆకర్షిస్తూ పాల్మ్ డీ ఓర్ పురస్కారం పొందింది. జూలియ డైరెక్ట్ చేసిన ఈ సినిమా 74 ఏళ్ల కాన్స్ చరిత్రలో రెట్టింపు ప్రత్యేకం. ఓ లేడీ డైరెక్టర్ పాల్మ్ డీ ఓర్ అవార్డ్ అందుకోవటం ఇది కేవలం రెండోసారి మాత్రమే! ‘మురినా’ చిత్రం కెమెరా డీ ఓర్ అవార్డ్ అందుకుని అందరి ప్రశంసలు చూరగొంది. ఇరానియన్ ఫిల్మ్ మేకర్ అస్ఘర్ ఫర్హదీ రూపొందించిన ‘ఏ హీరో’ సినిమా గ్రాండ్ ప్రీ అవార్డ్ స్వంతం చేసుకుంది.

ఇక బెస్ట్ డైరెక్టర్ గా కాన్స్ ను మెప్పించాడు లీయోస్ కారెక్స్. ఆయన రూపొందించిన ‘యానెట్టే’ సినిమా క్రిటిక్స్, కామన్ ఆడియెన్స్ ను ఏక కాలంలో మెప్పించగలిగింది! అలాగే, నార్వేకు చెందిన నటీమణి రెనేట్ ‘ద వరస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్’ సినిమాకిగానూ ఉత్తమ కథానాయిక అవార్డు పొందింది. ఉత్తమ నటుడిగా కాలెబ్ ల్యాండ్రీ జోన్స్ ‘నిట్రమ్’ సినిమాలో పాత్రతో ట్రోఫిని అందుకున్నాడు. ఈ సంవత్సరం స్పెషల్ జ్యూరి అవార్డ్ రెండు చిత్రాలు పంచుకున్నాయి. ‘మెమోరియా, అహెడ్స్ నీ’ చిత్రాలు కాన్స్ న్యాయనిర్ణేతల్ని మెప్పించగలిగాయి. బెస్ట్ స్క్రీన్ ప్లే పురస్కారం ‘డ్రైవ్ మై కార్’ కైవసం చేసుకోగా… ‘బెన్ డెట్టా, ద ఫ్రెంచ్ డిస్పాచ్’ సినిమాలు చాలా మందిని మంత్ర ముగ్ధుల్ని చేశాయి. భారీగా స్టాండింగ్ ఒవేషన్స్ లభించాయి…

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-