ఫోటోగ్రాఫర్ గా మారిన మ్యూజిక్ డైరెక్టర్

ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ ఇప్పుడు ఫోటోగ్రాఫర్ గా మారాడు. ఆయన ఇటీవల కాలంలో తాను తీసిన అద్భుతమైన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయన తాను తీసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల పిక్స్ ను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అందులో అల్లు అర్జున్ సన్ షైన్ లో మెరుస్తూ ఉండగా… బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న పిక్ కు బన్నీ ఫిదా అవుతున్నారు. త్రివిక్రమ్ పిక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ పిక్స్ చూస్తుంటే “అల వైకుంఠపురంలో” సినిమా చిత్రీకరణ సమయంలో తీసినట్టుగా అన్పిస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటించగా, త్రివిక్రమ్ దర్శకుడు. థమన్ సంగీతం అందించారు. గత ఏడాది జనవరిలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలోని సాంగ్స్ వరుసగా రికార్డులు సృష్టించాయి. “బుట్టబొమ్మ” సాంగ్ అయితే దేశవ్యాప్తంగా ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. సినిమా హిట్ కావడానికి సినిమా సంగీతం, సాంగ్స్ కూడా ముఖ్యకారణం. ప్రస్తుతం ఈ పిక్స్ ను బన్నీ అభిమానులు వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ “పుష్ప”తో బిజీగా ఉండగా, త్రివిక్రమ్ మహేష్ బాబు తో “ఎస్ఎస్ఎంబి28″కు సిద్ధమవుతున్నారు. ఇక టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో పలువురు స్టార్ హీరోల సినిమాలకు సంగీతం అందిస్తున్నారు.

Image
Image
-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-