తెలంగాణ యూనివర్సిటీలో కొత్త నియామకాలు రద్దు

తెలంగాణ యూనివర్సిటీలో అవుట్ సోర్సింగ్ పేరుతో ఇటీవల చేసిన నియామకాలు చెల్లవని చెప్పింది ప్రభుత్వం. అయితే నియామకాలేవి చేపట్టలేదంటూ ప్రకటించారు వీసీ. విద్యార్థి సంఘాలు, పాలకవర్గ సభ్యులు అక్రమ నియామకాలు జరిగాయని ఆరోపిస్తున్నారు. అసలు తెలంగాణ యూనివర్సిటీలో ఏం జరుగుతోంది? ప్రభుత్వం వీసీపై ఎందుకు సీరియస్‌ అయ్యింది?నిజామబాద్ జిల్లా డిచ్‌పల్లిలోని తెలంగాణ నిశ్వవిద్యాలయంలో ఔట్‌ సోర్సింగ్ నియామకాల వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. యూనివర్సిటీ వైస్ ఛాన్సులర్, రిజిస్ట్రార్ ఉద్యోగాలను అమ్ముకున్నారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వెలువెత్తాయి.

ఈ నిమాయకాలను రద్దు చేస్తూ ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్‌ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు వీసీ తీరుపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం..అయితే ఇదే అంశం పై నాలుగు రోజుల కిందట మీడియాతో మాట్లాడిన వీసీ రవీందర్ గుప్తా…యూనివర్సిటిలో తనపై కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అసలు కొత్త ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పారు.వీసీ ప్రకటన పెద్ద దుమారం రేపింది.

వీసీ చర్యను నిరసిస్తూ.. ఆందోళన చేపట్టిన విద్యార్థులు… తమ పరువుకు భంగం కలిగేలా ప్రకటన చేశారంటూ నిజామాబాద్ కోర్టును ఆశ్రయించారు. వీసీపై 5 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఆరోపణలపై బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.. తెలంగాణ వర్సిటీలో జరుగుతున్న ఉద్యోగాలు వివాదం ఈ నెల 30న జరిగే పాలకమండలి సమావేశంలో మరోసారి చర్చకి వచ్చే అవకాశం ఉంది. మరి ఉద్యోగాలే పెట్టలేదంటూ అధికారికంగా ప్రకటించిన వీసీ ఇప్పుడు ఎలాంటి సమాధానం చెబుతారో వేచి చూడాలి.

Related Articles

Latest Articles