మ‌నిషి 180 ఏళ్లు జీవించ‌డం సాధ్య‌మేనా…!!

సుమారు 70 ఏళ్ల క్రితం మ‌నిషి స‌గ‌టు ఆయుర్ధాయం 45 ఏళ్లుగా ఉండేది.  అప్ప‌ట్లో ఆరోగ్య‌వంత‌మైన ఫుడ్ అందుబాటులో ఉన్న‌ప్ప‌టికీ స‌రైన వైద్య సౌక‌ర్యాలు అందుబాటులో లేక‌పోవ‌డంతో  మ‌నిషి ఆయుర్ధాయం త‌క్కువ‌గా ఉన్న‌ది.  ఆ త‌రువాత టెక్నాల‌జీ అందుబాటులోకి వ‌చ్చింది.  అన్ని రోగాల‌ను మందులు, వైద్య చికిత్స‌లు అందుబాటులోకి వ‌చ్చాయి.  మ‌హ‌మ్మారుల నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు వ్యాక్సిన్ల‌ను రూపొందిస్తున్నారు.  దీంతో మ‌నిషి స‌గ‌టు ఆయుర్ధాయం ఇప్పుడు 70 ఏళ్ల‌కు పెర‌గింది.  2100 సంవ‌త్సం వ‌చ్చే స‌రికి మ‌నిషి ఆయుర్ధాయం 180 సంవ‌త్స‌రాల‌కు పెరుగుతుంద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.  ఆ స‌మ‌యంలో వైద్య చికిత్స‌కు అయ్యే ఖ‌ర్చు, ఇన్సూరెన్స్ ఖ‌ర్చులు పెరిగిపోతాయ‌ని నిపుణులు చెబుతున్నారు.  

Read: యూఎస్‌లో కరోనా ఉగ్రరూపం.. ప్రతీ సెకన్‌కు 9 పాజిటివ్‌ కేసులు..!

మ‌నిషి ఆయుర్థాయం పెర‌గ‌డం వ‌ల‌న ప్ర‌భుత్వాల‌పై విప‌రీత‌మైన భారాలు పెరిగే అవ‌కాశం ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు.  1918 లో వ‌చ్చిన స్పానిష్ ఫ్లూ కార‌ణంగా అప్ప‌ట్లో మ‌ర‌ణాల సంఖ్య అధికంగా ఉన్న‌ది.  దాని ప్ర‌భావం చాలా సంవ‌త్స‌రాల వ‌ర‌కు ఉన్న‌ది.  స్పానిష్ ప్లూకు ఇప్ప‌టి వ‌ర‌కు స‌రైన ఔషదం క‌నుగొన‌లేదు.  క‌రోనా మ‌హ‌మ్మారి ఇప్పుడు విల‌య‌తాండ‌వం చేస్తున్న‌ది.  6 నుంచి ఏడాది కాలంలోనే వ్యాక్సిన్ ను తీసుకొచ్చారు.  వేరియంట్‌ల దాడికి అనుగుణంగా వ్యాక్సిన్లు, బూస్ట‌ర్ డోసులు సిద్దం చేస్తున్నారు.  యాంటీబాడీల సంఖ్య పెర‌గ‌డంతో మ‌నిషి ఆయుర్ధాయం పెరిగే అవ‌కాశం ఉంటుంది.  

Related Articles

Latest Articles