ఆర్నాల్డ్ ను ఆటాడుకున్న ఆట బొమ్మ… 25 ఏళ్ల తరువాత తిరిగొచ్చింది!

అమెరికాలో దేన్నైనా మార్కెట్లో పెట్టి అమ్మేస్తారు! ఇక క్రిస్మస్ పండగ సంగతి వేరేగా చెప్పాలా? డిసెంబర్ లో వచ్చే అతి పెద్ద పండగ పాశ్చాత్యులకి చాలా ముఖ్యం. అందుకే, ఆ సమయంలో రకరకాలుగా మార్కెట్లో వ్యాపారం మొదలు పెడతారు వ్యాపారులు. వాల్ మార్ట్ లాంటి అతి పెద్ద కార్పొరేట్ కంపెనీలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. క్రిస్మస్ సమయంలో కేక్స్ మొదలు పిల్లలు ఆడుకునే ఆట బొమ్మల దాకా అన్నీ హాట్ కేక్స్ లా అమ్ముడుపోతాయి! అయితే, క్రీస్తు పుట్టిన ఓ గొప్ప పండగ రోజుని ఇలా మార్కెట్ లోకి లాగి వస్తువులు అమ్ముకోవటంపై ఓ సినిమా కూడా వచ్చింది. అదే ‘జింగిల్ ఆల్ ద వే’…

‘జింగిల్ ఆల్ ద వే’ సినిమాలో ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ ప్రధాన పాత్రలో నటించాడు. క్రిస్మస్ సందర్భంగా తన కొడుక్కి ఓ టాయ్ కొనటానికి ఆయన బయలుదేరుతాడు. అయితే ఆ ‘టర్బో మ్యాన్’ బొమ్మ ఎక్కడా దొరకదు. దాంతో ఆర్నాల్ట్ షాపింగ్ మాల్స్ వెంట తిరుగుతూ ఎలాంటి తంటాలు పడ్డాడన్నదే ‘జింగిల్ ఆల్ ద వే’ మూవీలోని స్టోరి! కామెడీగా కొనసాగినా సినిమాలో క్రిస్మస్ వేళ యూఎస్ లో కనిపించే వేలం వెర్రి చక్కగా చూపిస్తారు. సెటైర్ కూడా దాగుంటుంది…

‘జింగిల్ ఆల్ ద వే’ సినిమాలో సెటైర్ కోసం వాడిన ‘టర్బో మ్యాన్’ తరువాతి కాలంలో సూపర్ సక్సెస్ అయింది. ఆ బొమ్మని సినిమాలో చూపించినట్టే పిల్లలు విపరీతంగా కొనేశారు. ఇక సీన్ కట్ చేస్తే… ఇప్పుడు వాల్ మార్ట్ అనే కార్పొరేట్ కంపెనీ ‘టర్బో మ్యాన్’ టాయ్స్ ని ఎక్స్ క్లూజివ్ గా తమ స్టోర్స్ లో అమ్ముతోంది. ఇంకా క్రిస్మస్ కు చాలానే టైం ఉన్నా అమెరికాలో ఎవరో ఒక టిక్ టాక్ యూజర్ ‘జింగిల్ ఆల్ ద వే’ సినిమా క్లిప్పింగ్ బయటకు తీసి వైరల్ చేశాడు! అది చూసిన కస్టమర్స్ మళ్లీ టర్బో మ్యాన్ క్రేజ్ తో షాపింగ్ మొదలెట్టారట! అమెరికాలో ఏదైనా అమ్మేవారూ ఉంటారు… కొనేవారు కూడా ఉంటారు! అదే విడ్డూరం…

ఆర్నాల్డ్ ను ఆటాడుకున్న ఆట బొమ్మ… 25 ఏళ్ల తరువాత తిరిగొచ్చింది!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-