మోహన్ బాబుకు కౌంటర్ ఇచ్చిన నిర్మాత సి. కళ్యాణ్

చిత్ర పరిశ్రమలో సినిమా టికెట్ రేట్స్ ఇష్యూ అంతకంతకు పెద్దదిగా మారుతోంది. ఒకరిని అన్నారని మరొకరు… వేరే వాళ్ళు తమని అన్నారని ఇంకొకరు మాటల యుద్ధం చేస్తున్నారు. ఇక ఇటీవల ఈ విషయమై మంచు మోహన్ బాబు స్పందించిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు.. నలుగురు డిస్ట్రిబ్యూటర్లు కాదని, అస్సలు నిర్మాతల మధ్య ఐక్యత లేదని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇక తాజాగా మోహన్ బాబు వ్యాఖ్యలపై నిర్మాతల మండలి అధ్యక్షుడు సి కల్యాణ్‌ స్పందించారు.

ఇటీవల ఒక సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ” మంచు మోహన్ బాబు గారు మాట్లాడిన వ్యాఖ్యలను నేను వ్యతిరేకిస్తున్నాను.. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అన్ని సమస్యలపై ప్రభుత్వాలతో చర్చిస్తూనే ఉంది. మోహన్ బాబు గారు.. నిర్మాతలలో ఐక్యత లేదు అన్నారు.. గుర్తుంచుకొని మీరు కూడా ఒక నిర్మాతే.. మీ కొడుకు విష్ణు కూడా ఒక నిర్మాతే.. మీ ఫ్యామిలీ అంతా సినిమా రంగంలోనే ఉంది. మా వల్ల కాదు అనుకుంటే మీరు ముందు ఉండి ఈ సంధ్యను పరిష్కరించండి.. మీ వెనుకే మేము నిలబడతాము. నిర్మాతలందరిలో ఐక్యత లేదు అనడం సబబు కాదు.. సమస్యకు పరిష్కారం తెస్తాం అంటే మేము మీ వెనుకే నడుస్తాం” అంటూ చెప్పుకొచ్చారు. మరి ఈ వ్యాఖ్యలపై మోహన్ బాబు ఎలా స్పందిస్తాడో చూడాలి.

Related Articles

Latest Articles