రాజ‌స్థాన్‌ హైవేపై ర‌క్ష‌ణశాఖ విమానం ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్… ఎందుకంటే…

ఈరోజు దేశ చ‌రిత్ర‌లో ఓ అద్భుతం జ‌రిగింది.  విమానాల ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్‌కు హైవేలు ఎంత వ‌ర‌కు ఉప‌యోగ‌ప‌డ‌తాయి అనే విష‌యంపై ఓ ప్ర‌యోగాన్ని నిర్వ‌హించారు.  రాజ‌స్థాన్‌లోని జ‌లోర్ హైవేపై సీ 130 సూప‌ర్ హెర్క్యుల‌స్ విమానాన్ని ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ విమానం నేష‌న‌ల్‌హైవేపై ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన ఎమ‌ర్జెన్సీ ఫీల్డ్‌పై ల్యాండ్ అయింది.  ర‌క్ష‌ణ‌శాఖ‌కు చెందిన ఈ ట్రాన్స్‌పోర్ట్ విమానంలో ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్‌, కేంద్ర ఉపరిత‌ల ర‌వాణాశాఖ మంత్రి నితిన్ గ‌డ్కారి, ఎయిర్ చీఫ్ మార్ష‌ల్ బ‌దౌరియా, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావ‌త్ త‌దిత‌రులు పాల్గొన్నారు.  జాతీయ ర‌హ‌దారుల‌పై ఎమ‌ర్జెన్సీ ఫీల్డ్ ప్రారంబోత్సవం సంద‌ర్భంగా  ఈ విమానాన్ని ల్యాండింగ్ చేశారు.  ముఖ్య‌మైన జాతీయ ర‌హ‌దారుల‌పై ఇలా ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ ఫీల్డ్‌ల‌ను ఏర్పాటు చేస్తున్నారు.  

Read: ఆఫ్ఘ‌నిస్తాన్‌కు చైనా భారీ సాయం… అమెరికా కీల‌క వ్యాఖ్య‌లు…

Related Articles

Latest Articles

-Advertisement-