‘భాయ్ జాన్’పై బిజినెస్ మ్యాన్ కేసు! కంప్లైంట్ లో సల్మాన్ చెల్లెలి పేరు కూడా…

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు, కృష్ణ జింకలు వేటాడిన కేసు… ఇలా సల్మాన్ ఖాన్ కు పోలీస్ పిలుపులు, కోర్టు కష్టాలు కొత్తేం కాదు. కానీ, ఈసారి అతడి చెల్లెలు అల్వీరా ఖాన్ కూడా చిక్కుల్లో పడింది. ఛంఢీఘర్ లోని ఒక లోకల్ బిజినెస్ మ్యాన్ స్థానిక పోలీసుల్ని ఆశ్రయించాడు. ‘బీయింగ్ హ్యూమన్’ బ్రాండ్ నేమ్ తో సల్మాన్ సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు. అదే పేరుతో జ్యుయెలరీ అమ్మటం కూడా చేస్తుంటారు. ఛంఢీఘర్ లోని బిజినెస్ మ్యాన్ అరుణ్ గుప్తా ‘బీయింగ్ హ్యూమన్’ నగల దుకాణం తెరించేందుకు ఫ్రాంఛైజీ తీసుకున్నాడు. రెండు నుంచీ మూడు కోట్ల వరకూ ఖర్చు చేశాడు. కానీ, తీరా ఆయన కోట్లు సమర్పించుకున్నాక సల్మాన్ ఖాన్ మనుషులు ఆయన్ని మోసం చేశారట!

అరుణ్ గుప్తా ఛంఢీఘర్ స్టోర్ ఓపెనింగ్ కి సల్మాన్ వస్తాడని… ‘బీయింగ్ హ్యూమన్’ కంపెనీ అధికారులు మాటిచ్చి తప్పారట. ఆయన చెల్లెలి భర్త, బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మా ప్రారంభోత్సవానికి వచ్చాడంటున్నాడు గుప్తా. మరోవైపు, కోట్లు తీసుకున్నా కూడా ‘బీయింగ్ హ్యూమన్’ నుంచీ తనకు ఎటువంటి నగలు కూడా రాలేదట. డబ్బులు తీసుకుని నగలు డెలివరీ ఇవ్వకుండా సైలెంట్ అయిపోయారట. ఓసారి సల్మాన్ తనకు స్వయంగా మాటిచ్చి కూడా మోసం చేశాడని వాపోతోన్న అరుణ్ గుప్తా స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయటంతో నోటీసులు జారీ అయ్యాయి. సల్మాన్, అల్వీరా ఖాన్ సహా మరో అరుగురికి పిలుపు వచ్చింది. జూలై 13 లోపు వాళ్లు స్పందించాల్సి ఉంది. చూడాలి మరి, ‘బీయింగ్ హ్యూమన్’ భాయ్ జాన్ కి బిజినెస్ మ్యాన్ ఇచ్చిన షాక్ ముందు ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-