Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Airtel Nbfc License %e0%b0%8e%e0%b0%af%e0%b0%bf%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9f%e0%b1%86%e0%b0%b2%e0%b1%8d %e0%b0%ac%e0%b0%bf%e0%b0%97%e0%b1%8d %e0%b0%aa%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be%e0%b0%a8

Airtel NBFC License: ఎయిర్‌టెల్ బిగ్ ప్లాన్.. ముఖేష్ అంబానీకి గట్టి పోటీ!

Published Date :February 24, 2026 , 6:17 pm
By Shiva Ganesh
Airtel NBFC License: ఎయిర్‌టెల్ బిగ్ ప్లాన్.. ముఖేష్ అంబానీకి గట్టి పోటీ!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Airtel NBFC License: టెలికాం రంగంలో అగ్రగామిగా ఉన్న ఎయిర్‌టెల్, ఇప్పుడు ఆర్థిక రంగంలోకి అడుగుపెడుతోంది. తన సొంత ఫైనాన్స్ కంపెనీ అయిన ‘ఎయిర్‌టెల్ మనీ’ ద్వారా ఏకంగా రూ.20,000 కోట్ల పెట్టుబడితో రుణాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. కేవలం రీఛార్జ్‌లు, ఇంటర్నెట్ మాత్రమే కాకుండా.. ఇకపై తన కస్టమర్లకు నేరుగా లోన్లు (అప్పులు) ఇచ్చేందుకు ఎయిర్‌టెల్ రంగం సిద్ధం చేసుకుంది. ఈ మూలధనంలో 70 శాతం ఎయిర్‌టెల్ ద్వారా, మిగిలిన 30 శాతం భారతీ ఎంటర్‌ప్రైజెస్ నుంచి వస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఫిబ్రవరి 13, 2026న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి NBFCగా పనిచేయడానికి ఎయిర్‌టెల్ మనీ లైసెన్స్ తీసుకుంది.

READ ALSO: HPV vaccination: గర్భాశయ క్యాన్సర్లకు చెక్.. దేశవ్యాప్తంగా ఉచితంగా HPV వ్యాక్సినేషన్..

రాబోయే కొద్ది ఏళ్లలో రూ.20,000 కోట్లను ఈ కంపెనీలో పెట్టబోతున్నారని సమాచారం. ఇందులో 70% ఎయిర్‌టెల్ నుంచి, 30% భారతీ ఎంటర్‌ప్రైజెస్ నుంచి పెట్టబోతున్నారని తెలుస్తుంది. ఈ నిర్ణయంతో అంబానీకి చెందిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు ఎయిర్‌టెల్ గట్టి పోటీని ఇవ్వబోతోందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. ఎయిర్‌టెల్ గత రెండేళ్లలోనే తన డిజిటల్ యాప్ ద్వారా సుమారు రూ.9,000 కోట్ల లోన్లను ఇచ్చింది. ఇప్పుడు సొంతంగా ఫైనాన్స్ కంపెనీ పెడుతుండటంతో ఈ ప్రక్రియ ఇంకా వేగవంతం కానుందని అంచనా వేస్తున్నారు. కంపెనీ దగ్గర కస్టమర్ల డేటా, టెక్నాలజీ ఉండటం వల్ల, లోన్ తీసుకునే వారు తిరిగి కడతారా లేదా అనే రిస్క్‌ను ముందే అంచనా వేయగలమని ఎయిర్‌టెల్ నమ్మకంగా ఉంది. ఇప్పటివరకు ఎయిర్‌టెల్ కస్టమర్లు తమ యాప్ ద్వారా ఇతర బ్యాంకుల లోన్లు తీసుకునేవారు. కానీ ఇకపై ఎయిర్‌టెల్ తన సొంత డబ్బుతోనే కస్టమర్లకు చిన్న చిన్న లోన్లు, బిజినెస్ లోన్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల మధ్యతరగతి ప్రజలకు, వ్యాపారులకు సులభంగా లోన్లు దొరుకుతాయి. ఎయిర్‌టెల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ గోపాల్ విట్టల్ మాట్లాడుతూ.. NBFC విస్తరణ ద్వారా విశ్వసనీయమైన, వినూత్నమైన డిజిటల్ లెండింగ్ వ్యాపారాన్ని నిర్మించడమే తమ లక్ష్యమని అన్నారు.

READ ALSO: High Court: “జాతకం” పేరుతో మోసం చేస్తే రేప్ కేసు తప్పదు.. హైకోర్టు కీలక తీర్పు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 000 Crore Capital Infusion
  • Airtel Digital Lending News
  • Airtel Money Loan Distribution
  • Airtel Money NBFC License
  • Airtel Money vs Jio Financial Services

తాజావార్తలు

  • Deputy CM Pawan Kalyan: గత 20 నెలల కూటమి సర్కార్‌లో చేపట్టిన వివరాలు ఇవే.. పవన్‌ కల్యాణ్ పోస్ట్..

  • Telangana Farmers: రైతులకు శుభవార్త.. ఇక నుంచి ఆ సబ్సిడీ నేరుగా రైతుల ఖాతాల్లోకే..

  • T Congress : తెలంగాణ మహిళా కాంగ్రెస్ లో కొత్త చీఫ్ నియామకం చిచ్చు పెట్టిందా?

  • Cyber Fraud: హస్కీ వాయిస్‌తో కవ్వించింది.. 80 ఏళ్ల వృద్ధుడిని బుట్టలో పడేసింది.. ఏకంగా రూ.24 లక్షలు కొట్టేసింది!

  • Warangal Police: మత్తులో మరణం.. వరంగల్ పోలీసుల వినూత్న ప్రయత్నం.. స్మశానంలోనే యువతకు అవగాహన!

ట్రెండింగ్‌

  • Adulterated Rice : మీరు తింటున్నది ఒరిజినల్ బియ్యమేనా.? నీటితో కల్తీ బియ్యాన్ని గుర్తించే సులభమైన చిట్కా..!

  • 50MP+50MP+50MP కెమెరాలు, 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ తో vivo X300 FE విడుదల.. ఫీచర్స్, ధర ఇలా..!

  • Summer Family Vacations: ఫ్యామిలీ ట్రిప్‌ ప్లాన్ చేస్తున్నారా? సమ్మర్‌లో 5 బెస్ట్ ట్రావెల్ స్పాట్స్ ఇవే!

  • మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, Sony సెన్సర్‌తో కెమెరా సెటప్ తో Motorola Edge 70 Fusion భారత్‌లో లాంచ్..!

  • T20 World Cup 2026 Final: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. అభిమానుల కోసం ప్రత్యేక రైలు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions