కొనుగోలు కేంద్రాల్లో రైతులను బెదిరిస్తారా..?బండి సంజయ్

శాంతి భద్రతలను కాపాడటంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని బండి సంజయ్‌ ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ గుండాల దాడిలో బీజేపీ నేతల వాహనాలు ధ్వంసం అయ్యాయన్నారు. దాడి అనంతరం బండి సంజయ్‌ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ పై నిప్పులు చెరిగారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులను బెదిరించడమేంటని ఆయన మండి పడ్డారు. సీఎం డైరెక్షన్‌లోనే దాడులకు కుట్ర జరిగిందన్నారు. ప్రతి పక్ష పార్టీ అధ్యక్షుడిగా రైతులను కలిసేందుకు వస్తుంటే టీఆర్ఎస్ నేతలకు ఎందుకింత అసహనం వస్తుందో చెప్పాలని ప్రశ్నించారు.

మీ అసలు బండారం బయటపడుతుందనే భయంతోనే దాడులకు యత్నిస్తారా?రైతులు వచ్చి వాళ్ల బాధలు నాతో చెప్పుకుంటే రైతు లపై దాడి చేయిస్తారా? రైతులను మార్కెట్‌కు రాకుండా ఖాళీ చేయిం చారు. నలుగురైదుగురు టీఆర్ఎస్ కార్యకర్తలు నల్లజెండాలతో వస్తే మేం భయపడతామా? బీజేపీ కార్యకర్తలు తిరగబడితే మీరు తట్టు కుం టారా? మీరు గ్రామాల్లో తిరగగలరా? అంటూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పై విమర్శలు కురింపించారు. కేసీఆర్ తెలంగాణలో అరాచకం సృష్టిం చాలనుకుంటున్నారు. ప్రతిపక్ష పార్టీ నేతగా, ఎంపీగా రైతులను కల వడం మా హక్కు అని బండి సంజయ్‌ అన్నారు. బీజేపీ నేతలతో పెట్టుకుంటే కొరివితో తల గోక్కున్నట్లేనన్నారు. తుఫాన్‌ ప్రమాదం పొంచి ఉందని వడ్లు కొనాలని అడిగేందుకే వచ్చానని బండి సంజయ్‌ అన్నారు.

Related Articles

Latest Articles