రైల్వేశాఖ కీల‌క నిర్ణ‌యం: బెంగ‌ళూర్‌-హైద‌రాబాద్ మ‌ధ్య బుల్లెట్ ట్రైన్‌…

ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో కీల‌కంగా నిలిచిన బుల్లెట్ రైళ్ల‌ను ఇండియాలో లాంచ్ చేసేందుకు చాలా కాలంగా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.  గ‌తంలో కేంద్రం దేశంలో 8 కారిడార్ల‌లో బుల్లెట్ రైళ్ల‌ను తీసుకురావాల‌ని నిర్ణ‌యం తీసుకుంది.  ముంబై – సూరత్‌ – వడోదర – అహ్మదాబాద్‌, ఢిల్లీ – నోయిడా – ఆగ్రా – కాన్పూర్‌ –  లక్నో – వారణాసి, ఢిల్లీ – జైపూర్‌ – ఉదయ్‌పూర్‌ – అహ్మదాబాద్‌, ముంబై – నాసిక్‌ – నాగ్‌పూర్‌, ముంబై – పూణే – హైదరాబాద్‌, చెన్నై – బెంగళూరు – మైసూర్‌, ఢిల్లీ – ఛండీగడ్‌ – లూథియానా – జలంధర్‌ – అమృత్‌సర్‌, వారణాసి – పాట్నా – హౌరా మార్గాల్లో బుల్లెట్ రైళ్ల‌ను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్న‌ది.  

Read: కోవిడ్ ఎఫెక్ట్‌: ఆసుప‌త్రుల‌పై పెరుగుతున్న ఒత్త‌డి…

దీనికి సంబంధించి డీపీఆర్ ను ఇప్ప‌టికే పూర్తి చేశారు.  ఈ 8 కారిడార్‌లు కాకుండా భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌ను దృష్టిలో పెట్టుకొని మ‌రో నాలుగు కారిడార్‌ల‌లో కూడా బుల్లెట్ రైళ్ల ఏర్పాటుకు రైల్వేశాఖ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.  ఇందులో బెంగ‌ళూరు- హైద‌రాబాద్ మ‌ధ్య కూడా ఓ బుల్లెట్ ట్రైన్ మార్గం ఉన్న‌ది.  నాగ్‌పూర్‌ – వారణాసి, పాట్నా – గౌహ‌తి, అమృత్‌సర్‌ – పఠాన్‌కోట్‌ – జమ్ము మార్గాలు ఉన్నాయి.  

Related Articles

Latest Articles