‘ఆది’ రేంజ్‌లో వస్తాడనుకున్నాం.. కానీ ప్రవచనం చెప్పినట్టుంది

టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కొన్నిరోజులుగా టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. వైసీపీ నేతల వ్యాఖ్యలపై హీరో జూ.ఎన్టీఆర్ కూడా స్పందించారు. రాజకీయాల్లో విమర్శలు అర్థవంతంగా ఉండాలి కానీ వ్యక్తిగతంగా ఉండకూడదని చెప్తూ ఓ వీడియో విడుదల చేశాడు. అయితే జూ.ఎన్టీఆర్‌పై టీడీపీ నేత బుద్ధా వెంకన్న సంచలన ఆరోపణలు చేశారు.

Read Also: కాస్ట్ విషయంలో క్లారిటీ లేని నేత ఎవరు..?

కొడాలి నాని, వల్లభనేని వంశీలతో ఎన్టీఆర్‌కు మంచి సాన్నిహిత్యం ఉందని బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు. అయితే భువనేశ్వరిపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు వింటుంటే తమ రక్తం మరుగుతోందని… కొడాలి నాని మాటలపై జూ.ఎన్టీఆర్ ఏ ఆదిలాగానో, సింహాద్రి లాగానో స్పందిస్తాడనుకుంటే.. చాగంటి ప్రవచనాలు చెప్పాడంటూ బుద్ధా వెంకన్న ఆరోపించారు. వారిని హెచ్చరించకుండా ఎన్టీఆర్ వదిలేసినందుకు తాము ఆవేదన చెందినట్లు తెలిపారు. జూ.ఎన్టీఆర్ స్పందన చూసి టీడీపీ నేతలు బాధపడుతున్నారని.. అసలు ఎన్టీఆర్ ఈ అంశంపై స్పందించకపోయినా బాగుండేదని బుద్ధా వెంకన్న అభిప్రాయపడ్డారు. కాగా గతంలో కొడాలి నాని టీడీపీలో ఉన్నప్పుడు ఆయనకు ఎన్టీఆర్ గుడివాడ నియోజకవర్గం టిక్కెట్ ఇప్పించారని గతంలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

Related Articles

Latest Articles