‘పుష్ప’ యాక్షన్ సీక్వెన్స్ పది ‘కేజీయఫ్‌’ లతో సమానం!

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో వస్తున్న ‘పుష్ప’ సినిమాపై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. బన్నీ సరసన రష్మిక నటిస్తుండగా.. ఫహద్‌ ఫాజిల్‌ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. ఈ కథ బాగా పెద్దది కావడంతో రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు నిర్ణయించారు. అయితే తాజాగా ఈ సినిమాపై సుకుమార్ శిష్యుడు, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు స్పందించాడు. పుష్ప మొదటి పార్ట్ ఒక్కటే పది కేజీయఫ్‌ సినిమాలతో సమానం అన్నాడు. అల్లు అర్జున్ నటన మరియు సుకుమార్ గారి డైరెక్షన్ తో పుష్ప సినిమా మరో లెవల్ లో ఉందంటూ తెలిపాడు. పుష్పరాజ్ యాక్షన్ సీక్వెన్స్ పతాక స్థాయిలో చూపించారని బుచ్చిబాబు చెప్పుకొచ్చారు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పునప్రారంభించనున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-