ఆరు వారాలైనా అభిమానుల ఆరాటం తగ్గటం లేదు! ‘బీటీఎస్’ బిల్ బోర్డ్ రికార్డ్స్…

కొరియన్ ‘బీటీఎస్’ సూపర్ స్టార్స్ ఎంత మాత్రం వెనక్కి తగ్గటం లేదు. ఏడుగురు సభ్యుల ‘బీటీఎస్’ బృందం బిల్ బోర్డ్ వద్ద చరిత్ర సృష్టిస్తూనే ఉంది! విడుదలైన రోజు నుంచీ ‘బట్టర్’ సాంగ్ రికార్డులు బద్ధలు కొడుతూనే ఉంది. కే-పాప్ బ్యాండ్ ‘బీటీఎస్’ సత్తా ఏంటో ఈ తాజా గీతం మరొక్కసారి నిరూపించింది. ‘బట్టర్’ బిల్ బోర్డ్ పర్ఫామెన్స్ తో ఇప్పటికిప్పుడు ప్రపంచం మొత్తంలోనే కొరియన్ బాయ్స్ కి తిరుగులేదని ప్రూవ్ అయిపోయింది!

ఆరు వారాల క్రితం బీటీఎస్ తమ ‘బట్టర్’ మ్యూజికల్ నంబర్ ని రిలీజ్ చేసింది. ఆ రోజు నుంచీ ఇవాళ్టి దాకా యూట్యూబ్ లో, స్పాటిఫైలో ప్రతీ చోటా దుమారం సాగుతూనే ఉంది. మిలియన్ల కొద్దీ వ్యూస్, డౌన్ లోడ్స్ తో ‘బట్టర్’ దూసుకుపోతోంది. ‘ఆర్మీ’గా పిలవబడే బీటీఎస్ అభిమానుల సమూహం సొషల్ మీడియాలో రచ్చ చేసేస్తుననారు. బీటీఎస్ ఫ్యాన్స్ కోలాహలానికి హద్దే లేదు!
వరుసగా ఆరో వారం కూడా ‘యూఎస్ బిల్ బోర్డ్ హాట్ 100’ లిస్టులో నంబర్ వన్ గా నిలిచిన ‘బట్టర్’తో కొత్త రికార్డు నమోదు చేశారు బీటీఎస్ బాయ్స్! డెబ్యూతోనే ఇంత కాలం నంబర్ స్పాట్ లో ఉన్నది కొరియన్ మ్యూజికల్ బ్యాండ్ మాత్రమే. 1998లో ఓ అమెరికన్ పాప్ సింగర్స్ గ్రూప్ 5 వారాలు టాప్ స్లాట్ లో కొనసాగింది. ఇప్పుడు ఆ రికార్డ్ ‘బట్టర్’ దెబ్బతో బద్ధలైంది!

ఎవరూ ఊహించనంత సక్సెస్ రావటంతో బీటీఎస్ బాయ్స్ సంతోషంతో ఊగిపోతున్నారు. తమ ‘బట్టర్’ సాంగ్ ను నంబర్ వన్ పొజీషన్ లో కొనసాగిస్తోన్న అభిమానుల ‘ఆర్మీ’కి సొషల్ మీడియా పోస్టులో ధన్యవాదాలు తెలిపారు. నెక్ట్స్… గ్రామీ అవార్డ్ విజేత ఎడ్ శీరన్ తో కలసి కే-పాప్ సూపర్ స్టార్స్ కొత్త సింగిల్ తో మన ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే ‘పర్మీషన్ టూ డ్యాన్స్’ పేరుతో విడుదలైన టీజర్ ఆన్ లైన్ లో ఆసక్తి రేపుతోంది…

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-