‘వెన్న’తో వేడి పుట్టిస్తోన్న బీటీఎస్! ‘బట్టర్’తో గిన్నిస్ రికార్డులు బద్ధలు!

బీటీఎస్ మ్యూజిక్ బ్యాండ్ విడుదల చేసిన ‘బట్టర్’ సాంగ్ యూట్యూబ్ లో తుఫానులా కొనసాగుతోంది. అలాగే, ఆడియో షేరింగ్ వెబ్ సైట్ స్పొటిఫైలోనూ ‘బట్టర్’దే హంగామా! ఇవన్నీ పక్కన పెడితే కొరియన్ బాయ్స్ తమ ‘బట్టర్’ సాంగ్ తో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ని కూడా షేక్ చేస్తున్నారు!
పోయిన సంవత్సరం బీటీఎస్ విడుదల చేసిన ‘డైనమైట్’ సాంగ్ ఇంకా అవార్డులు సాధించి పెడుతోంది ఏడుగురు సింగర్స్ కి. అయితే, ఈసారి ‘బట్టర్’ మ్యూజికల్ అండ్ డ్యాన్స్ నంబర్ మరింత అదృష్టం తీసుకొచ్చింది సెవన్ మెంబర్స్ ఆఫ్ బీటీఎస్ కి! మే 21 రిలీజైన తాజా పాట ప్రిమియర్ సమయంలోనే పాత రికార్డు బద్ధలు కొట్టింది. మొత్తం 3.9 మిలియన్ కాన్ కరెంట్ వ్యూయర్స్ యూట్యూబ్ లో ‘బట్టర్’ ప్రీమియర్ చూశారు. ఇంతకు ముందు ఈ రికార్డ్ 3 మిలియన్లుగా ఉండేది. అది కూడా బీటీఎస్ పేరు మీదే ఉండేది. పోయిన సంవత్సరం ‘డైనమైట్’ ప్రీమియర్ సమయంలో మూడు మిలియన్ల మంది వీక్షించారు. ఇప్పుడు ‘బట్టర్’కి ఆ సంఖ్య 3.9 మిలియన్లకి పెరిగింది…
యూట్యూబ్ లో ప్రీమియర్ కి మిలియన్ల మందిని ఆకర్షించిన ‘బట్టర్’ సాంగ్ గిన్నిస్ రికార్డ్స్ లో నిలిచింది. అయితే, కేవలం ప్రీమియర్ మాత్రమే కాదు, ‘బట్టర్’ సింగిల్ కి తొలి రోజే 108 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి! ఇదీ రికార్డే! ఇక స్పోటిఫై వేదికపైన కూడా ‘బట్టర్’ బాంబులా పేలింది. తొలి రోజు ఈ పాటకి 11 మిలియన్లకు మించి గ్లోబల్ స్ట్రీమ్స్ నమోదయ్యాయి. గతంలో మరే ట్రాక్ కి ఇంతలా రెస్పాన్స్ రాలేదట!
ఇవన్నీ కాకుండా బీటీఎస్ మరో ‘గ్రూప్ రికార్డ్’ని కూడా గిన్నిస్ బుక్ లో స్వంతం చేసుకుంది. ‘బట్టర్’, ‘డైనమైట్’ లాంటి ఇంగ్లీష్ సాంగ్స్ మాత్రమే కాకుండా కొరియన్ భాషలో బీటీఎస్ టీమ్ గతంలో చాలా పాటలు విడుదల చేసింది. అవన్నిట్నీ కలుపుకుంటే… ఏప్రెల్ 27, 2021 వరకూ… మొత్తం 16.3 బిలియన్ సార్లు యూజర్స్ స్పోటిఫై పైన స్ట్రీమింగ్ చేశారు! బీటీఎస్ పాటలు ప్లే అయినంతగా మరే బ్యాండ్ కు సంబంధించిన సాంగ్స్ వీనుల విందు చేయలేదు. ఇది కూడా వరల్డ్ రికార్డ్ అని గిన్నీస్ బుక్ ప్రకటించింది!
రికార్డుల మాటెలా ఉన్నా జనం బీటీఎస్ అంటే పడిచచ్చిపోతున్నారు. అదీ ఇంపార్టెంట్! ఇప్పుడప్పుడే ఈ కొరియన్ ఆల్ బాయ్స్ మ్యూజికల్ బ్యాండ్ ని ఢీకొట్టే మొనగాళ్లు ఎవరూ లేరని మాత్రం గట్టిగా చెప్పవచ్చు!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-