సీఎం జగన్‌ను కలిసిన రమ్య కుటుంబ సభ్యులు..

క్యాంప్‌ కార్యాలయంలో సీఎం ఐఎస్‌ జగన్‌ను కలిశారు రమ్య కుటుంబ సభ్యులు.. జరిగిన ఘటనపై సీఎం జగన్‌ను వివరించారు రమ్య తల్లిదండ్రులు జ్యోతి, వెంకటరావు, అక్క మౌనికలు.. ఆ కుటుంబ సభ్యులను ఓదార్చిన సీఎం, ధైర్యాన్ని చెప్పారు.. తాము ఉన్నామంటూ హామీ ఇచ్చారు.. రమ్య కుటుంబ సభ్యులతో పాటు హోంమంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే మేరుగు నాగార్జున కూడా సీఎంను కలిసినవారిలో ఉన్నారు.. అనంతరం మీడియాతో మాట్లాడిన హోంమంత్రి సుచరిత.. పదిరోజుల్లో ఉద్యోగ నియామకం అయ్యాక సీఎంతో టీ తాగే అవకాశం కల్పించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.. మహిళల అత్యాచారం కేసుల్లో ఏడు రోజుల్లో చార్జ్ షీట్ వేస్తున్నాం.. ఇప్పటివరకు 1600 పైగా కేసుల్లో ఏడు రోజుల్లో చార్జిషీట్ వేశామని తెలిపిన ఆమె.. దిశ యాప్ ను 46 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారని తెలిపారు. ఇంకా 50 శాతం పైన ప్రజలకు దిశ యాప్ పై అవగాహన లేదని.. దిశ యాప్, చట్టంపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు.

మరోవైపు.. టీడీపీ నేతలను టార్గెట్‌ చేసి విమర్శలు కురిపంచారు సుచరిత.. 2018లో హత్యాచారానికి గురైన సుగాలి ప్రీతి కేసులో చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నారు? అని ప్రశ్నించిన ఆమె.. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సీబీఐ విచారణకు ఆదేశించామని గుర్తుచేశారు.. సుగాలి ప్రీతి కుటుంబాన్ని కూడా లోకేష్ పరామర్శిస్తే బాగుంటుందని హితవుపలికిన ఆమె.. మహిళల్లో అభద్రత భావాన్ని పెంచేలా లోకేష్ వ్యవహరించడం దురదృష్టకరం అన్నారు.. చిత్తశుద్ది ఉంటే పార్లమెంట్ లో దిశ చట్టం ఆమోదం కోసం టీడీపీ ఎంపీలు కృషి చేయాలని డిమాండ్‌ చేవారు. మహిళ చనిపోతే బాగుండు అక్కడికి వెళ్లి రాజకీయం చేసుకుంటా అనుకుంటున్నారు లోకేష్ అంటూ ఎద్దేవా చేవారు సుచరిత.. టీడీపీ హయాంలో ఎఫ్ఐఆర్ దాఖలు చేయటానికే రెండు వందల రోజులకు పైగా పట్టేదని మండిపడ్డ ఆమె.. కాల్ మనీ కేసుల్లో అధికార పార్టీ నేతలున్నారని చెప్పినా గత ప్రభుత్వంలో చర్యలు తీసుకోలేదన్నారు. గత ప్రభుత్వంలో వనజాక్షి విషయంలో చంద్రబాబు, లోకేష్ స్పందించలేదని.. కానీ, ఇప్పుడు లోకేష్‌ శవ రాజకీయాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు.. తాడేపల్లి ఘటనలో ఒక నిందితున్ని పట్టుకున్నాం రెండో నిందితున్నీ త్వరలో పట్టుకుంటామని తెలిపారు హోంమంత్రి సుచరిత.. మేడికొండూరు వివాహితపై అత్యాచారం ఘటనలో పోలీసులు వెంటనే స్పందించారన్న ఆమె.. ఫిర్యాదు తీసుకోలేదనేదు అనేది అవాస్తవం అన్నారు. దిశ చట్ట ప్రతులను లోకేష్ కాల్చడం అంటే చట్టాలపై వారికి ఎంత గౌరవం ఉందో అర్థమవుతుందన్నారు.. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్ట ప్రకారమే కేసులు నమోదు చేస్తున్నాం.. రమ్య కేసు నిందితుడికి విచారణ కోసం స్పెషల్ కోర్టు పెట్టి వేగంగా శిక్ష పడేలా చేయాలని సీఎం ఆదేశించారని వెల్లడించారు.. చట్టం అమల్లోకి వచ్చాక 21 రోజుల్లోనే నిందితులకు శిక్ష ఖరారు చేస్తామని తెలిపారు సుచరిత. కాగా, గుంటూరులో హత్యకు గురైన బీటెక్ స్టూడెంట్ రమ్య కేసు ఏపీలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే..

Related Articles

Latest Articles

-Advertisement-