బీఎస్‌ఎఫ్‌కు అధికారాల పెంపుపై వివాదం.. పంజాబ్‌ అభ్యంతరం..

సరిహద్దు భద్రతాదళం అధికారాలను పెంచుతూ కేంద్రహోంశాఖ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. బంగ్లాదేశ్, పాకిస్థాన్ తో అంతర్జాతీయ సరిహద్దుల నుంచి మూడు రాష్ట్రాల్లో 50 కిలోమీటర్లు లోపలి వరకు తనిఖీలు, అరెస్టులు, నిర్బంధం చేసే అధికారాలను బీఎస్‌ఎఫ్‌కు ఇస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ సరిహద్దుల నుంచి 15 కిలోమీటర్ల వరకు మాత్రమే బీఎస్‌ఎఫ్‌కు తనిఖీలు, అరెస్టులు చేసే అధికారముంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం సమాఖ్య స్పూర్తికి విరుద్ధం అంటూ పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ ఛన్ని అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తికి విఘాతం కలిగించే విధంగా కేంద్రం తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇది దేశ సమాఖ్య పై ప్రత్యక్ష దాడి అని అభివర్ణించారు. తక్షణమే ఈ అసంబద్దమైన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అమిత్‌షాను కోరారు పంజాబ్ సీఎం చన్నీ.

దేశ భద్రత కే ఈనిర్ణయం అంటూ కేంద్ర హోమ్ శాఖ సమర్థించుకుంటోంది. దేశ భద్రత రిత్యా బీఎస్‌ఎఫ్ అధికార పరిధిని పెంచాల్సి వచ్చిందని హోమ్ మంత్రిత్వ శాఖ చెబుతోంది. ఇటీవల డ్రోన్ల ద్వారా భారత భూభాగంలో ఆయుధాలను జారవేసిన సంఘటనలను కారణంగా చూపిస్తోంది. మొత్తం 10 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో జాతీయ భద్రత కు విఘాతం కలిగించే అక్రమ, చట్టవిరుధ్ద కార్యకలాపాలను నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతోంది హోంశాఖ. 1968 సరిహద్దు భద్రతా చట్టం లోని సెక్షన్ 139 కింద బీఎస్ఎఫ్‌ ఆపరేషన్స్ కు సంబంధించి ఆయా పరిస్థితులను బట్టి, ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునే అధికారాలు కేంద్రానికి ఉన్నాయి. సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, బెంగాల్, అస్సాం లలో బీఎస్ఎఫ్‌ అధికారులు తనిఖీలు చేసి, ఎవరినైనా నిర్బంధం లోకి తీసుకోవచ్చు. ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మిజోరం, త్రిపుర, మణిపూర్ ల తో పాటు, జమ్మూ కాశ్మీర్, లడక్ లో కూడా బీఎస్ఎఫ్‌ తనిఖీలు, అరెస్టులు చేయవచ్చు. ఈ షెడ్యూల్ లో మార్పులు చేస్తూ కేంద్ర హోమ్ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, సరిహద్దు రాష్ట్రాల్లో బీఎస్‌ఎఫ్‌ అధికారులు పాస్ పోర్ట్ చట్టం, కస్టమ్స్ చట్టం, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ చట్టం-1985, కింద తనిఖీలు, అరెస్టులు చేసే అధికారాలు సంక్రమించాయి. కేంద్రం తాజా నిర్ణయంతో ఏదైనా కేసులో కచ్చిత సమాచారముంటే, సత్వరమే బీఎస్ఎఫ్ చర్యలు తీసుకునే అవకాశముంటుందంటున్నారు బీఎస్‌ఎఫ్ అధికారులు.

-Advertisement-బీఎస్‌ఎఫ్‌కు అధికారాల పెంపుపై వివాదం.. పంజాబ్‌ అభ్యంతరం..

Related Articles

Latest Articles