ఆకట్టుకుంటున్న మల్లూ స్టార్స్ ఫ్యామిలీ డ్రామా… “బ్రో డాడీ” ట్రైలర్

మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ 2019 బ్లాక్‌బస్టర్ “లూసిఫర్‌”తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ చిత్రంలో మాలీవుడ్ మెగాస్టార్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించారు. ఇప్పుడు వీరిద్దరూ కాబోలో వస్తున్న రెండవ చిత్రం “బ్రో డాడీ”. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్నట్టు అర్థమవుతోంది. ట్రైలర్ లో మోహన్‌లాల్, మీనా జంటగా, పృథ్వీరాజ్ వారి కొడుకుగా కన్పించారు. మొదటి ఫ్రేమ్ నుండి చివరి ఫ్రేమ్ వరకు “బ్రో డాడీ” ట్రైలర్ లో ఉన్న వినోదాత్మక సన్నివేశాలు ఈ కుటుంబ కథా చిత్రంపై ఆసక్తిని పెంచేశాయి.

Read Also : ఏపీ సీఎం జగన్ కు ఆర్జీవీ హెచ్చరిక

ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ ప్రాజెక్ట్‌ని ఆశీర్వాద్ సినిమాస్ ద్వారా ఆంటోనీ పెరుంబవూరు నిర్మించారు. మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, మీనా, కళ్యాణి ప్రియదర్శన్, ఉన్ని ముకుందన్, లాలూ అలెక్స్, మురళీ గోపీ, కనిహా, సౌబిన్ షాహిర్ వంటి స్టార్స్ అంతా సినిమాలో భాగమయ్యారు. ఈ చిత్రానికి దీపక్ దేవ్ నేపథ్య సంగీతం అందించగా, అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. “బ్రో డాడీ” డైరెక్ట్ ఓటిటికి సిద్ధం అవుతోంది. జనవరి 26న డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది ఈ కామెడీ కేపర్.

Related Articles

Latest Articles