వ‌ధువు కావాలంటూ వినూత్న రీతిలో బిల్‌బోర్డ్ ఎక్కిన యువ‌కుడు…

పెళ్లి చేసుకోవాలి అనుకుంటే మ్యాట్రిమోనీని సంప్ర‌దించ‌డ‌మో లేదంటే తెలిసిన వారిని సంప్ర‌దించ‌డ‌మో చేయాలి.  కానీ, ఆ వ్య‌క్తి వినూత్న రీతిలో త‌న‌కు వ‌ధువు కావాల‌ని చెప్పి ప్ర‌చారం చేసుకుంటున్నాడు.  త‌న‌కు త‌గిన వ‌ధువును వెతికిపెట్టాల‌ని చెప్పి బిల్‌బోర్డ్ ఎక్కాడు.  మొద‌ట దానిని ప్రాంక్ అనుకున్నారు.  కానీ, అది ప్రాంక్ కాద‌ని, నిజంగానే త‌న‌కు వ‌ధువు కావాల‌ని చెప్ప‌డంతో ఆ వ్య‌క్తి సోష‌ల్ మీడియాలో ట్రెండ్‌గా మారిపోయాడు.  ఈ సంఘ‌ట‌న బ్రిట‌న్‌లో జ‌రిగింది.  

Read: విందుభోజనం కోసం మేకల దొంగతనం.. ట్విస్ట్‌ ఇచ్చిన మేకలు..

బ్రిట‌న్‌లో నివ‌శిస్తున్న పాక్ జాతీయుడు మ‌హ‌మ్మ‌ద్ మాలిక్ పెళ్లి చేసుకోవాల‌ని అనుకున్నాడు.  అనేక మందిని సంప్ర‌దించాడు.  కానీ త‌న‌కు న‌చ్చిన వ‌ధువు దొర‌క‌లేదు.  చివ‌రికి డేటింగ్ యాప్ ద్వారా కూడా ప్ర‌య‌త్నించాడు.  లాభం లేక‌పోయింది.  దీంతో స్నేహితుల స‌ల‌హా మేర‌కు ఈ విధంగా బిల్‌బోర్డ్‌పై యాడ్ ఇచ్చాడు.  మిగ‌తా డీటెయిల్స్ అన్నింటిని త‌న వెబ్‌సైట్‌లో ఇచ్చిన‌ట్టు పేర్కొన్నాడు.  

Related Articles

Latest Articles