పెళ్లైన కాసేపటికే పెళ్లి నగలు, నగదుతో వధువు పరార్‌

పెళైన కాసేపటికే పెళ్ళి కొడుకును వదిలేసి ప్రియుడితో పరారైంది ఓ నవ వధువు. హైదరాబాద్‌ బాలాపూర్‌లో ఈ ఘటన జరిగింది. బెంగళూరుకు చెందిన మహమ్మద్‌ ఇలియాస్‌కు హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన సమ్రిన్‌ బేగంతో ఇంట్లో పెళ్లి జరిగింది. అయితే, పెళ్లి సమయంలో రెండు లక్షల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలతో పాటు 50 వేల రూపాయల నగదు ఇచ్చాడు పెళ్లి కొడుకు ఇలియాస్‌. అయితే పెళ్లైన కొద్ది సేపటికే పెళ్లి కూరుతు సమ్రిన్‌ను పార్లర్‌కు తీసుకెళ్తామన్నారు ఆమె పిన్ని, మేనత్త. అయితే, వాళ్లు ఎంతకీ తిరిగి రాకపోవడంతో పెళ్లి కూతురు మేనమామల్ని నిలదీశాడు ఇలియాస్‌. దీంతో పెళ్లి కూతుర్ని ఆమె ప్రియుడితే పంపిన విషయం బయటపడింది. దీంతో పోలీసుల్ని ఆశ్రయించాడు ఇలియాస్‌. తనకు పెళ్లి కూతురు అక్కర్లేదని, డబ్బులు, బంగారం తిరిగి ఇప్పించాలని కోరుతున్నాడు.

-Advertisement-పెళ్లైన కాసేపటికే పెళ్లి నగలు, నగదుతో వధువు పరార్‌

Related Articles

Latest Articles