“సీటిమార్” బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే ?

మాచో హీరో గోపీచంద్ నటించిన “సీటిమార్” ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై గోపీచంద్ చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఈ సినిమా హిట్ గోపీచంద్ తో పాటు టాలీవుడ్ కు కూడా ముఖ్యమే. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలన్న పట్టుదలతో ఇప్పటి వరకూ పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఈ రోజు “సీటిమార్” మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు కావాల్సినంత ప్రమోషన్లు జరగడంతో బాగానే హైప్ ఉంది. ఈ యాక్షన్ ఓరియెంటెడ్ స్పోర్ట్స్ డ్రామా బిజినెస్ అంశానికి వస్తే మంచి రేటుకే థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయి.

Read Also : ఖిలాడీ : “ఇష్టం” లిరికల్ వీడియో సాంగ్

“సీటిమార్” థియేట్రికల్ హక్కులు రూ .11.5 కోట్ల ఫ్యాన్సీ రేటుకు అమ్ముడు పోయాయి. దీంతో ఈ సినిమా బ్రేక్ఈవెన్ టార్గెట్ రూ .12 కోట్లు. ఈ చిత్రం ఫస్ట్ షో నుంచి మంచి రెస్పాన్స్ రాబట్టుకుందంటే ఈ టార్గెట్ ను ఈజీగానే సాధించవచ్చు. ఈ చిత్రం తెలంగాణలో 214 థియేటర్లలో, ఆంధ్రప్రదేశ్‌లో 350 థియేటర్లలో విడుదలవుతోంది. మొత్తంగా ఈ చిత్రం జంట తెలుగు రాష్ట్రాల్లోని 565 థియేటర్లలో విడుదల కానుంది. 310 కి పైగా షోలు హైదరాబాద్‌లో మాత్రమే ఈ సినిమా కోసం కేటాయించడం విశేషం. ఈ సినిమా విజయం టాలీవుడ్‌కు చాలా కీలకం. ఇక “సీటిమార్” ప్రపంచవ్యాప్తంగా 14 కోట్లు వసూలు చేస్తే సూపర్ హిట్ అన్నమాట. సంపత్ నంది ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో తమన్నా హీరోయిన్ గా నటించింది.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-