10 టీజర్లు… 13 మోషన్ పోస్టర్స్… బాలీవుడ్ బాక్సాఫీస్ పై ‘బ్రహ్మాస్త్రం’!

ఎంత చెట్టుకి అంత గాలి! ఇది చాలా పాత సామెత అంటారా? ఎంత భారీ బడ్జెట్ చిత్రానికి అంతే భారీ ప్రమోషన్! ఇదీ ఇప్పుడు మన ప్యాన్ ఇండియా చిత్రాల వరస! ఇక లాక్ డౌన్ ఎత్తేస్తే తమ హంగామా ప్రారంభిద్దామని ఎదురు చూస్తున్నారట ‘బ్రహ్మాస్త్ర’ టీమ్. బాలీవుడ్ లో ప్రస్తుతం అందరి దృష్టీ ఈ సూపర్ హీరో మూవీనే ఆకర్షిస్తోంది. రణబీర్ కపూర్, ఆలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ రూపొందించిన చిత్రం దాదాపుగా పూర్తైంది. లాక్ డౌన్ తరువాత కొన్ని ప్యాచ్ వర్క్ లు మాత్రం కంప్లీట్ చేస్తారట.

అమితాబ్ బచ్చన్, మన నాగార్జున కూడా నటిస్తోన్న మచ్ అవెయిటెడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’ చాలా రోజులుగా ప్రొడక్షన్ లో ఉంది. లాక్ డౌన్స్ కారణంగా అనుకున్న సమయం కంటే ఎక్కువే అయింది. అయితే, ఈ సంవత్సరం చివర్లో ఎలాగైనా ‘బ్రహ్మాస్త్రం’ బాక్సాఫీస్ పై ప్రయోగించాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. అందుకే, ప్రస్తుత కరోనా సెకండ్ వేవ్ కొంచెం తెరిపినిస్తే వెంటనే ప్రమోషన్స్ భారీగా మొదలు పెట్టాలని రణబీర్, అయాన్ అండ్ టీమ్ రెడీగా ఉన్నారని సమాచారం.
‘బ్రహ్మాస్త్ర’ ప్రమోషన్స్ అదిరిపోవాలని ఆలోచిస్తోన్న ఫిల్మ్ మేకర్స్ ఇప్పటికే 10 టీజర్స్ సిద్ధం చేశారని చెబుతున్నారు. 13 మోషన్ పోస్టర్స్ కూడా రానున్న నెలలో విడుదల చేస్తారట. టీజర్లు ఇప్పటికే సెన్సార్ బోర్డ్ ముందుకు వెళ్లాయి. క్లీన్ యూ సర్టిఫికేషన్ కూడా పొందాయి. తెలుగు, తమిళ, బెంగాలీ, మలయాళీ వర్షన్స్ లో కూడా టీజర్స్ రిలీజ్ చేసే సన్నాహాలు చేస్తున్నారు. చూడాలి మరి, రియల్ లైఫ్ లవ్ బర్డ్స్ రణబీర్, ఆలియా తొలిసారి కలసి నటిస్తోన్న హై బడ్జెట్ ఫ్యాంటసీ మూవీ ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-