బ్రహ్మానందం తనయుడు గౌతమ్ కొత్త సినిమా ప్రారంభం

బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా కొత్త సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాను ఎస్ ఒరిజినల్స్ పతాకంపై సృజన్ యరబోలు నిర్మిస్తున్నారు. ఈ మూవీతో సుబ్బు చెరుకూరి దర్శకుడి గా పరిచయం అవుతున్నారు. సర్వైవల్ థ్రిల్లర్ అనే కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమాను తీస్తున్నారు.

మోనోఫోబియాతో బాధపడుతున్న అప్ కమింగ్ రచయిత తన జీవితానికి ప్రమాదం ఎర్పడినప్పుడు ఎలా అధిగమించి బయటపడ్డాడన్నదే కథాంశం. శ్రీరామ్ మడ్డూరి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం శుక్రవారం ఆరంభం అయింది. యస్ ఒరిజినల్స్ లో దర్శకుడిగా పరిచయం కాబోతున్న విశ్వ క్లాప్ ఇచ్చారు.

Related Articles

Latest Articles