నేడు బ్రహ్మంగారి మఠంలో పీఠాధిపతుల బృందం పర్యటన..

నేడు బ్రహ్మంగారి మఠంలో పీఠాధిపతుల బృందం పర్యటించనుంది. సామరస్యంగా పీఠాధిపతి వివాదం పరిష్కారం చేస్తామని అంటున్నారు పీఠాధిపతుల బృందం. కానీ వారి రాకను వ్యతిరేకిస్తున్నారు రెండో భార్య మహాలక్ష్మి. పీఠాధిపతులు వస్తున్న నేపథ్యంలో మఠం పరిసర ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి భద్రత ఏర్పాటు చేసారు పోలీసులు. ఇప్పటికే పీఠాధిపతుల బృందంపై డిజిపికి ఫిర్యాదు చేసారు మహాలక్ష్మి. అయితే బ్రహ్మంగారి మఠం వీరబ్రహ్మేంద్రస్వామి వారిని దర్శించుకున్నారు పీఠాధిపతుల బృందం. దర్శనం కోసం లోపలికి కొరకు పోలీసులు అనుమతి ఇవ్వని పక్షంలో ఆలయం వెలుపల నుండే దర్శించుకున్నారు పీఠాధిపతులు. అనంతరం ప్రొద్దుటూరుకు బయల్దేరి వాసవీ కన్యకా పరమేశ్వర దర్శనం అనంతరం తిరిగి మఠానికి రానున్నారు. మఠానికి చేరుకున్న అనంతరం పీఠాధిపతి వారసులతో కలసి సమావేశం కానున్నారు పీఠాధిపతుల బృందం. అయితే ఈ పీఠాధిపతుల పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-