ట్రెండింగ్ లో “బాయ్ కాట్ కరీనా ఖాన్”

బాలీవుడ్ బెబో కరీనాకపూర్ పై నెటిజన్లు ఇప్పుడు చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఆమె రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథను అందిస్తున్న ‘సీత’ అనే పౌరాణిక సినిమాలో సీత పాత్రలో నటిస్తుందనే వార్తలు వచ్చాయి. ఈ చిత్రంలో సీతమ్మగా నటించడానికి ఆమె తన సాధారణ రెమ్యూనరేషన్ కన్నా ఎక్కువగా డిమాండ్ చేసిందని, ఈ సినిమా కోసం కరీనా 12 కోట్ల రూపాయలను పారితోషికంగా అడిగిందని, అంతేకాకుండా ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాలన్నీ పూర్తయ్యాకనే ‘సీత’ చిత్రాన్ని మొదలు పెడతానని మేకర్స్ తో చెప్పిందని అంటున్నారు. అయితే ఈ వార్తల్లో లో నిజం ఎంత ఉందో తెలియదు కానీ నెటిజన్ల ఆగ్రహానికి మాత్రం ఇదే కారణం అయింది. కరీనా సీత పాత్ర కోసం అంత డిమాండ్ చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. మరో వర్గం వారు మాత్రం కరీనా కపూర్ ఖాన్ నిజ జీవితంలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ అనే ముస్లింను వివాహం చేసుకున్న కారణంగా… ఆమె హిందూ దేవత అయిన సీత పాత్రను పోషించాడానికి వీల్లేదంటూ ట్రోలింగ్ మొదలెట్టారు. అంతేకాదు ఆమె శూర్పణఖ పాత్రకు మాత్రమే కరెక్టుగా సరిపోతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈరోజు సోషల్ మీడియాలో “బాయ్ కాట్ కరీనా కపూర్ ఖాన్” అనే హ్యాష్ ట్యాగ్ ను ట్విట్టర్లో ట్రెండ్ చేశారు. దీనిపై కరీనా కపూర్ ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం కరీనా కపూర్ రెండు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తోంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-