“అఖండ” సీక్వెల్ కన్ఫర్మ్… ఎప్పుడంటే ?

చిత్రపరిశ్రమలో ‘అఖండ’ హిట్ తో 2021 విన్నర్ గా నిలిచారు బాలయ్య. కరోనా ఉన్నప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తన సినిమాను విడుదల చేసి, బ్లాక్ బస్టర్ హిట్ తో చిత్రపరిశ్రమలో ఒక ధైర్యాన్ని నింపారు. ఇక ఈ సినిమా విజయవంతం కావడం పట్ల చిత్రబృందం కూడా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా బాలయ్యలో, ఆయన అభిమానుల్లో ఆ జోష్ స్పష్టంగా కన్పిస్తోంది. ‘అఖండ’ సినిమా థియేటర్లలో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. తాజాగా ఈ సినిమా థ్యాంక్స్ మీట్ ను నిర్వహించారు మేకర్స్. ఇందులో దర్శకుడు బోయపాటి ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.

Read Also : Avatar 2 : టైమ్ ఆగయా… రిలీజ్ డేట్ ఫిక్స్

సక్సెస్ మీట్ లో భాగంగా నిర్వహించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్ లో ‘అఖండ’కు సీక్వెల్ లేదా రీమేక్ ఉంటుందా ? అనే ప్రశ్న ఎదురైంది టీంకు. ఈ ప్రశ్నకు బోయపాటి స్పందిస్తూ ఖచ్చితంగా ఉంటుందని కన్ఫర్మ్ చేశారు. ‘అఖండ’లోనే సీక్వెల్ కు సంబంధించి లీడ్ వదిలాము అని అన్నారు. కానీ ఎప్పుడు ? ఎక్కడ? ఎలా అనేది మాత్రం సస్పెన్స్. ఆ విషయాన్నీ తరువాత వేరే స్టేజిపై వెల్లడిస్తాము అని సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చారు. ఇంకేముంది నందమూరి అభిమానులు ఈ వార్తతో ఫుల్ ఖుషీ !

Related Articles

Latest Articles