టాలీవుడ్ లో మరో క్రేజీ మల్టీస్టారర్ “బిబిబి”… ఎవరెవరంటే ?

టాలీవుడ్ లో ఇప్పుడు స్టార్ హీరోల కాంబోలో క్రేజీ మల్టీస్టారర్స్ రూపొందుతున్న విషయం తెలిసిందే. అది కూడా పాన్ ఇండియా లెవెల్లో మన హీరోలు వెండి తెరపై పోటీ పడి నటించడాన్ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా మరో అద్భుతమైన మల్టీస్టారర్ రాబోతోందని ప్రచారం జరుగుతోంది. “బిబిబి” కాంబో అంటూ నిన్నటి నుంచి సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి. విషయం ఏంటంటే ?

Read Also : కల నెరవేరింది అంటూ మోహన్ బాబు కీలక ప్రకటన

‘అఖండ’తో బాలయ్యకు హ్యాట్రిక్ హిట్ అందించిన బోయపాటి ఈ క్రేజీ మల్టీస్టారర్ ను రూపొందించనున్నారు. ‘అఖండ’ చిత్రం థ్యాంక్స్ మీట్ ను నిన్న నిర్వహించారు టీం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బోయపాటికి మల్టీస్టారర్ గురించి ఓ ప్రశ్న ఎదురైంది. బాలయ్య, బన్నీలతో బోయపాటి మల్టీస్టారర్ ఉంటుందా ? అనే ప్రశ్నకు… బోయపాటి స్పందిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. “సినిమా పరిశ్రమలో ఏదైనా జరగవచ్చు. సరైన సమయం, సిట్యుయేషన్ కోసం వేచి ఉండాలి” అని అన్నారు. దీంతో “బిబిబి” మల్టీస్టారర్ ఉంటుందని ప్రచారం జోరందుకుంది. అల్లు అర్జున్, బాలకృష్ణ ఇద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటే అది ఖచ్చితంగా ప్రేక్షకులకు మాస్ ఫీస్ట్ అవుతుంది.

Related Articles

Latest Articles