లోకేష్ ఎన్ని జన్మలు ఎత్తినా.. ఎమ్మెల్యే అవుతాడా ? : బొత్స

టీడీపీ పార్టీకి దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ. లోకేష్ ఎన్ని జన్మలు ఎత్తినా.. ఎమ్మెల్యే అవ్వగలడా…? అంటూ చురకలు అంటించారు. వైజాగ్ కు పరిపాలన రాజధాని తరలింపు న్యాయ పరిధిలో ఉన్నాయి.. అసెంబ్లీ సమావేశాలు నిర్వహణ నుండి తాము పారిపోమన్నారు.
ఈ రాష్ట్రంలో మాకో అడ్రెస్ ఉంది..ప్రతిపక్ష నేతలే వలస పక్షులు అంటూ కౌంటర్‌ ఇచ్చారు. బీజేపీ మాకు మిత్ర పక్షం కాదని… తమకు బీజేపీ రాజకీయ మిత్రపక్షం కాదని తెలిపారు. వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉంటే..మేము రాష్ట్రంలో అధికారంలో ఉన్నామని చెప్పారు బొత్స. 13 మునిసిపాలిటీ లు ఎన్నికలు జరిగాయని… అన్ని కూడా వైసీపీ నే విజయం సాధిస్తుంది అని భావిస్తున్నామని చెప్పారు. 22 ఇంకా జరగలిసి ఉంది…కోర్టు నుండి అనుకూలంగా తీర్పు వస్తే వాటికి త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అధికారo కోల్పోయిన చంద్రబాబు కుప్పం లో ఏమి చేస్తున్నారో చూస్తున్నామని.. చంద్రబాబు ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నాడని ఫైర్‌ అయ్యారు. ఓడిపోయే వాడే చంద్రబాబులాగా మాట్లాడతారని చురకలు అంటించారు.

Related Articles

Latest Articles