బోనాల సుధారాణి.. ఇకలేదు

సుధారాణి ఈ పేరు హైదరాబాద్ అందులో ముఖ్యంగా పాత బస్తీవాసులకు చాలా సుపరిచితం. బోనాలు, మొహరం పండుగ వస్తే సుధారాణి స్పెషల్ అందులో కనపడుతుంది. సుధారాణి అంటే ఎవరో కాదు బోనాల పండుగ దినం అమ్మవారి ఊరేగింపు, మొహర్రం రోజు బిబికా ఆలం ఊరేగింపు కోసం ఉపయోగించే అంబారి ఏనుగు.

హైదరాబాద్ వాసులకు ఎంతగానో సేవలందించిన ఈ సుధారాణి అనే ఏనుగు బెల్గాం జిల్లా కర్ణాటక రాష్ట్రంలో ఈరోజు ఉదయం మరణించింది. గత రెండు సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సుధారాణి కి ట్రీట్మెంట్ చేసిన వైద్యులు తెలిపారు.సుధారాణి ఇక లేదన్న వార్త తెలిసిన పాతబస్తీ వాసులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

Related Articles

Latest Articles