బీజేపీ ఎంపీ ఇంటిపై బాంబుల దాడి..

భారతీయ జనతా పార్టీ ఎంపీ అర్జున్‌ సింగ్‌ నివాసంపై దుండగులు బాంబులు విసరడంతో తీవ్ర కలకలం రేపింది.. పూర్తి వివారాల్లోకి వెళ్తే.. కోల్‌కతాలోని ఎంపీ అర్జున్‌ సింగ్‌ ఇంటి దగ్గర ఇవాళ ఉదయం బైక్‌పై వచ్చిన కొందరు దుండగులు బాంబులు విసిరారు.. మొత్తం మూడు బాంబులు ఇంట్లోకి విసిరే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుండగా.. అవి ఇంటి గేటు దగ్గర పేలాయి.. ఈ ఘటనలో ఇంటి గేటు ధ్వంసం అయ్యింది. ఇక, ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో.. అంతా ఊపిరి పీల్చుకున్నారు.. అయితే, ఈ దాడి జరిగినప్పుడు.. సదరు ఎంపీ ఇంట్లో లేరు.. ఆయన ఢిల్లీలో ఉన్నట్టుగా తెలుస్తోంది.. ఇక, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు..

ఢిల్లీలో ఉన్న ఎంపీ అర్జున్‌ సింగ్.. ఇవాళ కోల్‌కతాకు రానున్నట్టుగా తెలుస్తోంది… ఇక, ఈ ఘటనపై తీవ్రంగా మండిపడుతోంది బీజేపీ.. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వ్యక్తులే ఈ దాడికి పాల్పడి ఉంటారని ఆరోపిస్తున్నారు బీజేపీ బెంగాల్‌ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌.. కాగా, బీజేపీ ఆరోపణలను తోసిపుచ్చింది టీఎంసీ.. బీజేపీలో ఉన్న అంతర్గత వ్యవహారాలతోనే బాంబు దాడులు జరిగిఉంటాయని వ్యాఖ్యానించింది. మరో వైపు.. ఈ ఘటనపై బెంగాల్‌ గవర్నర్‌ ట్వీట్ చేశారు. కాగా, పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి టీఎంసీ, బీజేపీ నేతల మాటల యుద్ధమే కాదు.. దాడులు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి.. ఎన్నికల సమయంలో.. కొన్ని ప్రాంతాల్లో హింస చెలరేగింది.. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా పలు దాడులు, ప్రతి దాడులు జరుగుతూనే వచ్చాయి. తాజాగా, ఎంపీ నివాసం ఇంటి ముందే బాంబు పేలుళ్లు జరగడం తీవ్ర కలకలం రేపుతోంది.

Related Articles

Latest Articles

-Advertisement-