గెలుపు కోసం… గెస్ట్ అప్పియరెన్స్ లు నమ్ముకుంటోన్న… ఖాన్స్!

బాలీవుడ్ లో ఇప్పుడు బాగా చర్చ నడుస్తోన్న చిత్రాల్లో ‘పఠాన్, టైగర్ 3’ రెండూ ఉన్నాయి. రెండిట్నీ యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రానే నిర్మిస్తున్నాడు. మణిశర్మ దర్శకత్వంలో వస్తోన్న ‘టైగర్ 3’లో సల్మాన్ హీరో కాగా ‘పఠాన్’లో షారుఖ్ ఖాన్ లీడ్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇక ఈ రెండు స్పై థ్రిల్లర్స్ ప్రస్తుతం ముంబైలోనే షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. అంతే కాదు, ఒకే స్టూడియోలో సల్మాన్, షారుఖ్ మకాం వేశారు. ‘టైగర్ 3’ కోసం సల్మాన్ తో పాటూ కత్రీనా కూడా సేమ్ స్టూడియోలో బస చేస్తున్నట్టు సమాచారం! సిద్ధార్థ్ ఆనంద్ దర్వకత్వం వహిస్తోన్న ‘పఠాన్’ కోసం కింగ్ ఖాన్ ముందుగానే షూటింగ్ లో పాల్గొంటుండగా సల్మాన్ ఈ మధ్యే ‘టైగర్’ కోసం బరిలోకి దిగాడు. అయితే, ‘జీరో’ తరువాత షారుఖ్ కి చాలా గ్యాప్ రాగా సల్మాన్ కి గత కొన్ని రోజులుగా సరైన హిట్ లేదు.

అందుకే, ‘పఠాన్ అండ్ టైగర్ 3’ ఇద్దరు ఖాన్స్ కి చాలా ఇంపార్టెంట్. అందుకే, తమ సినిమాలకి హైప్ తెచ్చే ఏ అంశం కూడా వదలటం లేదు. ‘పఠాన్’లో గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వటానికి సై అన్న సల్మాన్ ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేశాడు. తాజా సమాచారం ప్రకారం ‘టైగర్ 3’లో సల్మాన్ కోసం షారుఖ్ కూడా అతిథిగా రాబోతున్నాడట. బాలీవుడ్ బాద్షా ఇంకా ‘టైగర్ 3’ షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది! సల్మాన్ ఒకేసారి షారుఖ్ తో పాటూ ఆమీర్ ఖాన్ ను కూడా చుట్టేస్తున్నాడు! ఆయన నటిస్తోన్న ‘లాల్ సింగ్ చద్దా’ మూవీలో కండల వీరుడు క్యామియోతో అలరించనున్నాడట! ‘భాయ్ జాన్’ అన్న పేరుకి తగ్గట్టుగా సల్మాన్ తన ఖాన్ సోదరులు షారుఖ్, ఆమీర్ కు గెస్ట్ రోల్స్ తో సాయం చేస్తుండటం… బీ-టౌన్ లో చర్చకు కారణం అవుతోంది! చూడాలి మరి, ‘పఠాన్, టైగర్ 3, లాల్ సింగ్ చద్దా’ చివరకు ఏమవుతాయో!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-