“హరి హర వీరమల్లు” షూటింగ్ లో బాలీవుడ్ స్టార్స్… ఎప్పుడంటే…?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ తెరకెక్కిస్తున్న భారీ పీరియాడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఎ.ఎమ్.రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. తాజాగా ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ అర్జున్ రాంపాల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కీలక పాత్రలు పోషించనున్నారు. ఔరంగజేబు పాత్రలో అర్జున్ కనిపించనుండగా, జాక్వెలిన్ మొఘల్ రాణిగా నటించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ 50 శాతం పూర్తయ్యింది. అయితే అర్జున్, జాక్వెలిన్ ఇప్పటివరకూ సినిమా షూటింగ్ లో పాల్గొనలేదు. చిత్ర నిర్మాత ఎ.ఎమ్.రత్నం తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హైదరాబాద్లో లాక్డౌన్ ఎత్తివేసిన తరువాత… సినిమా షూటింగులకు అనుమతి లభించిన తరువాత తదుపరి షెడ్యూల్ ప్రారంభమవుతుంది. అందులో అర్జున్, జాక్వెలిన్ ఇద్దరూ పాల్గొంటారని వెల్లడించారు. 17వ శతాబ్దపు పీరియాడికల్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-