‘బాహుబలి’తో యుద్ధం చేస్తానంటోన్న బాలీవుడ్ కామెడీ యాక్టర్!

మామూలుగా సినిమాలకి ఉన్నంత క్రేజ్ సీరియల్స్ కి ఉండదు. కానీ, ఇది పాత మాట. ఇప్పుడు టీవీ సీరియల్స్ కూడా ఫుల్ డిమాండ్ లో ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా, కొన్ని అరుదైన కామెడీ సీరియల్స్ మళ్లీ మళ్లీ కావాలని జనం కోరుకుంటూ ఉంటారు. అటువంటిదే హిందీలో వచ్చిన ‘కిచిడి’. ఓ గుజరాతీ కుటుంబంలో జరిగే కామెడీ సీన్సే ఈ సీరియల్ లో కథ! పెద్దగా స్టోరీ ఏం లేకున్నా నటీనటుల డైలాగ్స్, యాస, హావభావాలు ప్రేక్షకులకి భలేగా నచ్చేశాయి. అయితే, ‘కిచిడి’కి సీజన్ 2 రూపంలో ‘ఇన్ స్టాంట్ కిచిడి’ వచ్చింది. తరువాత మళ్లీ ‘కిచిడి’ పేరుతోనే మూడో సీజన్ ప్రసారమైంది. అయినా సోషల్ మీడియాలో ‘కిచిడి’ సీరియల్ ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు న్యూ సీజన్ కావాలనే డిమాండ్ చేస్తున్నారు. దాంతో లెటెస్ట్ గా ‘కిచిడి’ సీరియల్ ప్రొడ్యూసర్ ఓ ట్వీట్ చేశాడు. అందులో సరికొత్త కిచిడి వండి వడ్డించబోతున్నామని హింట్ అయితే ఇచ్చాడు!
‘కిచిడి’ సీరియల్ నిర్మాత జమ్నాదాస్ మజేతియా. గుజరాతీ రంగస్థల నటుడు, సినిమా నటుడు కూడా అయిన ఈయన హిందీలోనూ కొన్ని సినిమాలు చేశాడు. అయితే, ‘కిచిడి’ సీరియల్ లో కూడా జేడీ మజేతియా ఓ ఫన్నీ క్యారెక్టర్ చేస్తుంటాడు. ఆయనే స్వయంగా ‘కిచిడి’ సీజన్ 4 గురించి మాట్లాడే సరికి హాస్య ప్రియులకి ఆశలు చిగురించాయి. జేడీ మజేతియా నిర్మించిన మరో సూపర్ హిట్ సీరియల్ ‘సారాభాయ్ వర్సెస్ సారాభాయ్’ కూడా కొత్తగా కావాలంటూ నెటిజన్స్ రిక్వెస్టు చేస్తున్నారు. ఆ సీరియల్ గురించి జేడీ ఇంత వరకూ మాట్లాడలేదుగానీ… పెద్ద తెరపై తాను చేయాలనుకుంటోన్న డ్రీమ్ క్యారెక్టర్ గురించి చెప్పాడు!
బుల్లితెర మీద చెప్పుకోదగ్గ పేరు సంపాదించిన జమ్నాదాస్ మజేతియా ఏదైనా ఒక సినిమాలో ప్రభాస్ తో కలసి నటించాలని కోరుకుంటున్నాడట. అదీ కామెడీ పాత్రలో కాదు. విలన్ గా బాహుబలిని ఎదుర్కోవాలని ఆరాటపడుతున్నాడట! ఆయన కల నెరవేరుతుందో లేదోగానీ … జేడీ మజేతియా మరో ‘కిచిడి’తో జనం ముందుకొస్తే చాలా ఇళ్లలో నవ్వుల పూవులు పూస్తాయి! అది త్వరగా జరగాలని మనమూ కోరుకుందాం…

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-