కంగనా, దీపికా మొదలు అక్షయ్, సల్మాన్ దాకా… అందరికీ ‘వారంటే’ హడల్!

‘కర్ణి సేన’… ఈ పేరు చెబితే బాలీవుడ్ అమాంతం అలెర్ట్ అవుతుంది! ఎందుకంటే, రాజ్ పుత్ వర్గం వారి ఈ సంస్థ ఇప్పటికి చాలా సార్లు హిందీ సినిమాలపై తమ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతే కాదు, కర్ణి సేన డిమాండ్లకు ఫిల్మ్ మేకర్స్ ఒప్పుకోకుంటే వివాదాలు చిలికి చిలికి గాలివాన అవుతుంటాయి. ఇక అక్షయ్ కుమార్ నటిస్తోన్న చారిత్రక చిత్రం ‘పృథ్వీరాజ్’ తాజాగా కర్ణి సేన కంట్లో పడింది. ఆ సినిమా టైటిల్ కేవలం ‘పృథ్వీరాజ్’ అని కాకుండా ‘వీర్ యోధా సమ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్’ అని సగర్వంగా మార్చాలంటూ పట్టుబడుతున్నారు. అయితే, టైటిల్ ఛేంజ్ పై ఇంకా ‘పృథ్వీరాజ్’ మూవీ నిర్మాత ఆదిత్య చోప్రా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.

Image

సంజయ్ లీలా బన్సాలీ ‘పద్మావత్’ కూడా అప్పట్లో కర్ణిసేన ఆగ్రహానికి గురైంది. తమ ఆరాధ్య దేవత లాంటి మహారాణి పద్మవతిని తప్పుడు కోణంలో చూపుతున్నారని కర్ణిసేన సభ్యులు నిరసనలు తెలిపారు. అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్ర ధారి రణవీర్ తో దీపికకి డ్రీమ్ సాంగ్ ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ, కర్ణిసేన ఒత్తిడికి తలొగ్గిన దర్శకనిర్మాతలు వారి అనుమానాలన్నీ తీర్చాకే మూవీ రిలీజ్ చేశారు. పైగా పేరుని ‘పద్మావతీ’ అని కాకుండా ‘పద్మావత్’ గా మార్పు చేశారు.

Image

హిందూ దేవుళ్లని కించపర్చిన ‘తాండవ్’ వెబ్ సిరీస్ కి కూడా కర్ణి సేన సెగ బాగానే తగిలింది. కోర్టుల్లో నానా తంటాలు పడ్డ ‘తాండవ్’ టీమ్ కర్ణి సేన బెదిరింపులకి కూడా బెంబేలెత్తాల్సి వచ్చింది. హిందూ దేవుళ్లని కించపరిచిన వాళ్ల కుత్తుకలు కోస్తే కోటీ రూపాయలు ఇస్తామంటూ మహారాష్ట్ర కర్ణిసేన నాయకులు ప్రకటించారు.

Image

అక్షయ్ కుమార్ ‘లక్ష్మీ బాంబ్’ సినిమా ‘లక్ష్మీ’గా మారటానికి కూడా కర్ణి సేనే కారణం. లక్ష్మీ అమ్మవార్ని అవమానించేదిగా మూవీ టైటిల్ ఉందని వారు అభ్యంతరంత వ్యక్తం చేశారు. ఫిల్మే మేకర్స్ పెద్దగా బెట్టు చేయకుండానే టైటిల్ తగిన విధంగా మార్చేశారు.

Image

కంగనా రనౌత్ ‘మణికర్ణిక’ సినిమా కూడా కర్ణి సేన కోపానికి గురైంది. ఝాన్సీ లక్ష్మీభాయికి, ఒక బ్రిటీష్ అధికారికి మధ్య సంబంధం ఉన్నట్టు సినిమాలో చూపిస్తారని ప్రచారం జరిగింది. కర్ణి సేన రంగంలోకి దిగి హెచ్చరికలు చేయటంతో ‘అటువంటివేవీ’ చిత్రంలో ఉండవని దర్శకనిర్మాతలు స్పష్టం చేశారు.

Image

రాజ్ పుత్ మహారాణి జోధా భాయి కథతో తెరకెక్కిన ‘జోధా అక్బర్’ కూడా అబద్ధాల పుట్ట అంటూ కర్ణిసేన ఉద్యమం లేవనెత్తింది. సినిమాలో చూపిందంతా తప్పేనంటూ కర్ణి సేన సభ్యులు రోడ్డెక్కారు. చివరకు, రాజ్ పుత్ ల ప్రాబల్యం ఉండే రాజస్థాన్ లో ‘జోధా అక్బర్’ విడుదలే కాలేదు!

Image

సల్మాన్ ఖాన్ ‘వీర్’ సినిమా కూడా కర్ణి కాకను ఎదుర్కున్నదే. అందులో తమ రాజ్ పుత్ వర్గాన్ని తప్పుగా చూపారంటూ కర్ణి కార్యకర్తలు థియేటర్లపై దాడులు చేశారు. కొంత ఆస్తి నష్టం తప్పలేదు…

Image
-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-