బోల్డ్ ఫొటోతో కంగనా మరో వివాదం.. వాళ్లకి కూడా మూడ్ తెప్పించేలా

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కి వివాదాలు కొత్తేమి కాదు… నిత్యం ఆమె వివాదాలతోనే జీవిస్తోంది. ఇక ఇటీవల పద్మశ్రీ అందుకున్న హాట్ బ్యూటీ భారత స్వాతంత్య్రం గురించి కామెంట్స్ చేసి వివాదంలో చిక్కుకుంది. సరే కొద్దిరోజుల్లో ఆ వివాదం ముగుస్తుంది అనుకోనేలోపు సిక్కు మతాల గురించి మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేసి మరో వివాదానికి తెరలేపింది. దీంతో ఆమెపై ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ, శిరోమణి అకాలీదళ్ ముంబై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాయి.

ఇక ఈ కేసుపై కంగనా కొంచెం ఘాటుగానే స్పందించింది. తన బోల్డ్ ఫొటోతో సమాధానం చెప్పి కొత్త వివాదానికి నాంది పలికింది. తాజాగా అమ్మడు ఒక బోల్డ్ ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. బ్లాక్ అండ్ బ్లాక్ టూ పీస్ డ్రెస్ లో మందు గ్లాస్ చేతపట్టి సెక్సీ లుక్ లో దర్శనమిచ్చింది. ఆ ఫోటో చూస్తే ఎవరికైన మతిపోవాల్సిందే.. ‘ఇంకోరోజు ఇంకో ఎఫ్ఐఆర్. ఒకవేళ వారు నన్ను అరెస్టు చేయడానికి వస్తే నా మూడ్ ఇలా ఉంటుంద‌’ని దానికి క్యాప్షన్ ఇచ్చింది. పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తే నా మూడ్ ఇలా ఉంటుందని చెప్పుకొచ్చింది. అంటే తనకు ఎటువంటి భయం లేదని, పోలీసులు అరెస్ట్ చేయలేరని చెప్పకనే చెప్తుందా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి పోలీసులు కంగనాపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

Related Articles

Latest Articles