హనీ ట్రాప్ లో బాలీవుడ్ నటుడి భార్య అరెస్ట్… కోట్ల నగదు స్వాధీనం

బడా పారిశ్రామికవేత్తలు, వ్యాపారులను టార్గెట్ చేస్తూ లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న హనీ ట్రాప్ ముఠాను ముంబై క్రైమ్ బ్రాంచ్ పట్టుకుంది. అరెస్టయిన నిందితుల్లో ఒక మహిళా ఫ్యాషన్ డిజైనర్ ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె తొంభైల నాటి బాలీవుడ్ నటుడి భార్య స్వప్న అలియాస్ లుబ్నా వజీర్. ఆమెతో పాటు ఇద్దరు మగ మోడల్స్ ఈమెకు సహకరిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఫ్యాషన్ డిజైనర్ లుబ్నా వజీర్ అలియాస్ సప్నా ఇంటిపై పోలీసులు దాడి చేయగా రూ.29 లక్షల నగదు దొరికింది. దీంతో పాటు 7 మొబైల్ ఫోన్లు, 2 కార్లు, ఎనిమిది లక్షలకు పైగా విలువైన నగలు లభ్యమయ్యాయి.

హనీ ట్రాప్ గ్యాంగ్ లో ఎవరెవరు ఉన్నారు ?
పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం లుబ్నా వజీర్ ముంబైలోని జుహు, బాంద్రా, లోఖండ్‌వాలా నుండి గోవా వరకు కిట్టీ పార్టీలు, అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ఇలా చాలా మంది సంపన్నులతో స్నేహం చేస్తూ వారికి దగ్గరైంది. దీని తర్వాత వారిని హనీ ట్రాప్ చేసి లక్షలు, కోట్ల రూపాయలు దోచుకుంటుంది. ఈ పనిలో లుబ్నా గ్యాంగ్ మొత్తం ఉంది. ఇందులో కొందరు మగ మోడల్స్, కొందరు ఆడ మోడల్స్ ఇన్వాల్వ్ అయ్యారు. హనీ ట్రాప్‌లో చిక్కుకుని లుబ్నా వజీర్ దోచుకున్న వారిని సంప్రదించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Read Also : తగ్గేదే లే అంటున్న ‘భీమ్లా నాయక్’ ప్రొడ్యూసర్… ట్వీట్ తో ఫుల్ క్లారిటీ

మూడేళ్ళలోనే మూడు కోట్లకు పైగా…!
2016 నుంచి 2019 మధ్య మూడేళ్ల పాటు ఒక పారిశ్రామికవేత్తను ట్రాప్ చేశారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన ఓ బడా పారిశ్రామికవేత్త వ్యాపారం నిమిత్తం ముంబైకి రాగా, ప్లాన్ ప్రకారం ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో ఆయనను ట్రాప్ చేశారు. ముందుగా వ్యాపారం సాకుతో ఆయనను కలవడానికి వచ్చిన ఇద్దరు మహిళలు సరదాగా కబుర్లు చెబుతారు. కలిసి డిన్నర్ చేస్తారు. తరువాత ఒక అమ్మాయి తనను ఎవరో కలవడానికి వచ్చారని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తరువాత మరో మహిళ వాష్ రూమ్ కు వెళ్తుంది. తరువాత ఓ వ్యక్తి వచ్చి వాళ్ళ రూమ్ తడతాడు. అంతలోపు ఆ అమ్మాయి నగ్నంగా వచ్చి, బెడ్ పై పడుకుని అతను తనను అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తూ దొంగ ఏడుపులు ఏడుస్తుంది. ఆ వ్యక్తి ఫోన్ లో ఫోటోలు తీస్తాడు. అతనికి ఏం జరిగిందో అర్థమయ్యేలోగానే అంతా అయిపోతుంది. అలా ఈ ముఠా ప్రముఖులను హనీ ట్రాప్ లో చిక్కుకునేలా చేసి, ఫోటోలు, వీడియోలతో బెదిరించి, 2019 నుంచి ఇప్పటి వరకు ఓ వ్యాపారవేత్త నుంచి రూ.3 కోట్ల 26 లక్షలు రికవరీ చేశారు. రానురానూ వారి ఆగడాలు భరించలేక చివరికి ఈ పారిశ్రామికవేత్త ఓడిపోయి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీని తర్వాత లుబ్నా వజీర్, ఆమె ఇద్దరు మగ సహచరులు, ఇతర మహిళా మోడల్స్‌తో కూడిన ఈ పెద్ద ‘హనీ ట్రాప్’ ముఠా గురించి పోలీసులకు తెలిసింది.

Related Articles

Latest Articles