న్యూషెప‌ర్డ్ రోద‌సి యాత్ర ఇలా… భూమి నుంచి 100 కి.మీ పైన…

ఈరోజు సాయంత్రం న్యూషెప‌ర్డ్ వ్యోమ‌నౌక రోద‌సిలోకి ప్ర‌యాణం చేయ‌బోతున్న‌ది.  రోద‌సిలోకి ప్ర‌యాణం చేయ‌బోతున్న ఈ నౌకను తిరిగి వినియోగించేందుకు అనువుగా త‌యారు చేశారు. ప‌శ్చిమ టెక్సాస్‌లోని ఎడారి నుంచి వ్యోమ‌నౌక రోద‌సిలోకి ప్ర‌యాణం చేస్తుంది.  నిట్ట‌నిలువుగా పైకి దూసుకెళ్లే ఈ నౌక భార‌ర‌హిత స్థితికి చేరుకున్నాక‌, నౌన నుంచి బూస్ట‌ర్ విడిపోతుంది.  విడిపోయి త‌రువాత బూస్ట‌ర్ తిరిగి నేల‌కు చేరుకుంటుంది.  వ్యోమనౌక అక్కడి నుంచి మ‌రింత ఎత్తుకు చేరుకుంటుంది.  క‌ర్మ‌న్ రేఖ‌ను దాటి పైకి వెళ్లిన కాసేటి త‌రువాత ఈ నౌక తిరుగు ప్ర‌యాణం అవుతుంది.  భార‌ర‌హిత స్థితిలో ఉన్న‌ప్పుడు ఆ నౌక‌లోని ప్ర‌యాణిలుకు సీటు బెల్టు తీసేసి భార‌ర‌హిత స్థితిని పొందుతారు.  తిరిగి నౌక భూవాతావ‌ర‌ణంలో ప్ర‌వేశించిన త‌రువాత సీటుబెల్టు పెట్టుకుంటారు.  ఈ నౌక క్ర‌మంగా కింద‌కు దిగుతూ పారాచూట్‌ల‌ను తెరుచుకుంటుంది.  గంట‌కు 16 కిలోమీట‌ర్ల వేగాన్ని త‌గ్గించుకుంటూ నేల‌పైకి దిగుతుంది. 

Read: తెలకపల్లి రవి: ఇన్‌సైడర్‌ ట్రేడ్‌ కేసు కొట్టివేసిన సుప్రీం, వచ్చే మార్పు ఏముంటుంది?

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-