ఇంట్లోనే పేలిన ఫ్రిజ్… వృద్ధురాలికి తీవ్రగాయాలు

హైదరాబాద్ కూకట్‌పల్లి వెంకట్రావునగర్‌లోని ఓ ఇంట్లో శుక్రవారం మధ్యాహ్నం పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఇంట్లో ఉన్న వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమె హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఇంటి కిటికీలు, తలుపులు, ఇతర విలువైన సామాగ్రి ధ్వంసమయ్యాయి. ఫ్రిజ్ నుంచి కంప్రెసర్ గ్యాస్ లీక్ కావడంతోనే పేలుడు సంభవించినట్లు పోలీసులు నిర్ధారించారు.

కాగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారని పోలీసులు తెలిపారు. వెంకట్రావునగర్‌లో నివసించే ప్రజలందరూ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారన్నారు. ఫ్రిజ్ ఎగిరిపడటంతో తునాతునాకలు అయ్యిందని పోలీసులు పేర్కొన్నారు.

Related Articles

Latest Articles