కరోనా కాలంలోనూ… ‘బ్లాక్ విడో’కి బ్లాక్ బస్టర్ కలెక్షన్స్!

కరోనా ప్యాండమిక్ దారుణం నుంచీ హాలీవుడ్ పూర్తిగా కొలుకున్నట్టేనా? దాదాపుగా అంతే అనిపిస్తోంది! ఇంకా ప్రపంచం మొత్తం మహమ్మారి బారి నుంచీ బయటపడలేదు. థియేటర్స్ ఇంకా పూర్తిగా తెరుచుకోలేదు. జనం కూడా కరోనాకి ముందటి కాలంలోలాగా ఇప్పుడు రావటం లేదు! అయినా హాలీవుడ్ చిత్రాలు మిలియన్ల కొద్దీ డాలర్లు వసూలు చేసి సినిమా సత్తాని చాటుతున్నాయి.

ఈ వారాంతంలో ప్రేక్షకుల్ని విపరీతంగా అలరించిన చిత్రం మర్వెల్ సూపర్ హీరో మూవీ ‘బ్లాక్ విడో’. వీకెండ్ లో 80 మిలియన్ యూఎస్ డాలర్స్ కొల్లగొట్టింది. ప్యాండమిక్ తరువాత ఇదే అతి పెద్ద రికార్డ్! థియేటర్స్ తో పాటూ డిస్నీ ప్లస్ ఓటీటీలోనూ ఏక కాలంలో అందుబాటులోకి వచ్చింది ‘బ్లాక్ విడో’ చిత్రం. దాంతో ఆన్ లైన్ స్ట్రీమింగ్ తోనే 60 మిలియన్ డాలర్స్ ‘బ్లాక్ విడో’ ఖాతాలో పడ్డాయి. వాటితో పాటూ ఓవర్ సీస్ లో వసూలైన 78 మిలియన్ డాలర్స్ కూడా కలుపుకుంటే మొత్తం 158 మిలియన్ డాలర్స్ కలెక్షన్లు పోగైనట్టు లెక్క!

Read Also : ఉదయనిధితో అందాల నిధి! కోలీవుడ్ లో ‘ఇస్మార్ట్’ బ్యూటీ బిజీ!

‘బ్లాక్ విడో’ తరువాత లాస్ట్ వీకెండ్ లో సెకండ్ ప్లేస్ సాధించింది, ‘ఎఫ్ 9’. 10.8 మిలియన్ డాలర్స్ ఈ యాక్షన్ థ్రిల్లర్ జమ చేయగలిగింది. ఇప్పటి వరకూ ‘ఎఫ్ 9’ కంప్లీట్ కలెక్షన్స్ ఆరా తీస్తే… ప్రపంచ వ్యాప్తంగా 541.8 మిలియన్ డాలర్లు వసూలయ్యాయట! మొత్తంగా అటు అమెరికాలోనూ, ఇటు బయటి ప్రపంచ మార్కెట్లలోనూ హాలీవుడ్ చిత్రాలు మళ్లీ పుంజుకోవటం మొదలు పెట్టాయని చెప్పుకోవచ్చు. ఓటీటీల్లో కూడా భారీగా డబ్బులు వస్తుండటం కరోనా కాలంలోనూ ఎంతో రిలీఫ్ కలిగించే విషయం!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-