కరోనా నుంచి కోలుకున్న వారిపై బ్లాక్ ఫంగస్ పంజా…

కరోనా నుంచి కోలుకున్న వారిపై బ్లాక్ ఫంగస్ పంజా...

కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న వారిలో కొత్త సమస్యలు కనిపిస్తున్నాయి.  కరోనా నుంచి విజయవంతంగా కోలుకున్న వ్యక్తుల్లో బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ సోకుతున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు.  ఈ బ్లాక్ ఫంగస్ కారణంగా కంటి చూపు కోల్పోతున్నారని వైద్యులు చెబుతున్నారు.  సూరత్ లో ఇలాంటి కేసులు బయటపడుతున్నాయి.  బ్లాక్ ఫంగస్ సోకిన వ్యక్తులకు వైద్యం చేయడం కష్టంగా మారిందని, ఖర్చుతో కూడుకొని ఉండటంతో అందరికి అందుబాటులో ఉండటం లేదని సూరత్ వైద్యులు పేర్కొంటున్నారు.  ప్రస్తుతం బ్లాక్ ఫంగస్ బారిన పడిన బాధితులు సుమారు 50 మంది వరకు గుర్తించినట్లు వైద్యులు పేర్కొన్నారు.  మరో 60 మంది చికిత్స కోసం ఎదురుచూస్తున్నారని వైద్యులు పేర్కొన్నారు.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-