హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో.. బ్లాక్ బాక్స్ ల‌భ్యం

హెలికాప్టర్ ప్రమాద స్థలంలో బ్లాక్ బాక్స్ లభ్యం అయింది. ఢిల్లీ నుంచి వచ్చిన బృందాలకు ఈ బ్లాక్ బాక్స్ దొరికింది. ప్రమాద స్థలం నుంచి 30 అడుగుల దూరంలో బ్లాక్ బాక్స్ లభ్యమైనట్లు… ఢిల్లీ నుంచి వచ్చిన బృందాలు తెలిపాయి. దీంతో బ్లాక్ బాక్స్ ను స్వాధీనం చేసుకున్నారు ఆర్మీ అధికారులు. అనంతరం బ్లాక్ బాక్స్ ను విశ్లేషణ కోసం ఢిల్లీ బృందం ప్రమాద ఘటనా స్థలం నుంచి తీసుకు వెళ్ళింది.

కాగా…త‌మిళ నాడు రాష్ట్రంలో నిన్న చోటు చేసుకున్న హెలి కాప్ట‌ర్ ప్ర‌మాదంలో… ఏకంగా.. 13 మంది మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. అయితే.. ఈ ప్ర‌మాదంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మ‌ర‌ణించ‌డం విషాద‌కరం. అయితే.. ఈ ఘ‌ట‌న లో ఐఏఎఫ్ కెప్టెన్ వ‌రుణ్ సింగ్ ఒక్క‌డే ప్రాణాల‌తో బ‌య‌ట ప‌డ్డారు.

Related Articles

Latest Articles