ఇది పాదయాత్ర కాదు.. కేసీఆర్ మీద దండ యాత్ర..

తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్ర కొనసాగుతోంది.. ఇప్పటికే 100 కిలోమీటర్ల మైలురాయిని దాటేసింది.. ఇక, సంజయ్‌ పాదయాత్రలో కేంద్రమంత్రులు, బీజేపీ సీనియర్‌ నేతలు, ప్రజాప్రతినిధులు, మాజీ సీఎంలు.. ఇలా రోజుకో నేత పాల్గొంటున్నారు. ఇవాళ బీజేవైఎం నేషనల్‌ ప్రెసిడెంట్‌ తేజస్వి సూర్య.. సంజయ్‌ పాదయాత్రలో కొద్దిసేపు తెలుగులోకి మాట్లాడారు తేజస్వి సూర్య.. బండి సంజయ్ చేసేది పాదయాత్ర కాదు కేసీఆర్ మీద చేసే దండ యాత్ర అన్న ఆయన.. తెలంగాణ వచ్చినప్పుడు కేసీఆర్ నినాదం నీళ్లు, నిధులు, నియమాకాలు.. కానీ, ఇప్పుడు కన్నీరు, అప్పులు, నిరుద్యోగం అన్నారు.. ఇక, కేసీఆర్‌పై చేసే ఈ ధర్మ యుద్ధంలో బీజేపీ విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆరోపించారు.. టీఆర్ఎస్ పాలనలో ఎవరు సంతోషంగా లేరన్న తేజస్వి సూర్య.. యువమోర్చా కార్యకర్తలను చూసి టీఆర్ఎస్‌ భయపడుతుందన్నారు. ఇక, అధికార పార్టీపై మండిపడ్డ ఆయన.. కేసీఆర్, కేటీఆర్, టీఆర్ఎస్‌ గూండాలకు చెబుతున్నా.. మీ గూండా గిరికి మేం భయపడమని హెచ్చరించారు. కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని సెటైర్లు వేసిన తేజస్వి సూర్య.. తెలంగాణ అభివృద్ధి జరగాలంటే బీజేపీ ప్రభుత్వం రావాలన్నారు. టీఆర్ఎస్ నలుగురు వ్యక్తులు ది.. కానీ, బీజేపీ ప్రతి ఒక్కరిది అన్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-