బండి‌ సంజయ్ పాదయాత్ర.. తొలిదశకు ఇవాళే ముగింపు

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి‌ సంజయ్ కుమార్‌ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర మొదటి విడత ఇవాళ్టితో ముగియనుంది.. ఈ సందర్భంగా హుస్నాబాద్ లో రోడ్ షో, ముగింపు సభ నిర్వహణకు బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి.. ఇక, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ రాబోతున్నారు.. మెత్తం 36 రోజుల పాటు 438 కిలో మీటర్లు మేర పాదయాత్ర చేశారు బండి సంజయ్.. ఎనిమిది జిల్లాల్లోని 19 అసెంబ్లీ, 6 పార్లమెంట్ నియోజకవర్గాలను టచ్ చేస్తూ ముందుకు సాగారు.. మెత్తం 35 సభలు, రైతులు, నిరుద్యోగులు, మహుళల సహా.. వివిధ వర్గాల నుంచి సుమారు 11 వేలకి పైగా వినతి పత్రాలు స్వీకరించారు.. ఇక, ఈ పాదయాత్రలో పాల్గొన్న ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, ఆరుగురు కేంద్రమంత్రులు, పలువురు జాతీయ నాయకులు పాల్గొన్నారు..

బండి సంజయ్ కుమార్ చేపట్టిన ‘ప్రజా సంగ్రామ యాత్ర’ తొలిదశ పాదయాత్ర ఆగస్టు 28న చార్మినార్‌ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం చెంత నుండి ప్రారంభమైంది.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో రోడ్ షో, బహిరంగ సభతో ఈ తొలిదశ పాదయాత్ర ముగియనుంది. భాగ్యలక్ష్మీ అమ్మవారి వద్ద నుండి ఇప్పటి వరకు పాదయాత్రలో ప్రజలను కలుస్తూనే వారి సమస్యలు వింటూనే భరోసానిచ్చేందుకు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు, కేంద్రం తెలంగాణకు ఇస్తున్న నిధుల వివరాలను వెల్లడించేందుకు ఇప్పటి వరకు మొత్తం 34 సభలు నిర్వహించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఇవాళ జరగబోయే హుస్నాబాద్ సభతో కలిపితే మొత్తం 35 సభలు నిర్వహించినట్లవుతుంది. చార్మినార్, గోల్కొండ, ఆరె మైసమ్మ, మొయినాబాద్, చేవెళ్ల, మన్నెగూడ, మోమిన్ పేట్, సదాశివపేట, సంగారెడ్డిలో 2, జోగిపేటలో 2, రంగంపేట, నర్సాపూర్ లో 2, మెదక్ లో 2, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డిలో 2, ఎర్రపాడు, తాడ్వాయి, లింగంపేట, కామారెడ్డిలో 2, మాచారెడ్డి చౌరస్తా, గంభీరావుపేట, ముస్తాబాద్, అంకిరెడ్డిపల్లె, పెద్ద లింగాపూర్, ఇల్లంతకుంట, బెజ్జంకి, కోహెడ, పొట్లపల్లి, హుస్నాబాద్ ప్రాంతాల్లో బండి సంజయ్ కుమార్ గారు సభలు నిర్వహించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అందరి సమస్యలు వింటూ వారికి భరోసానిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వ తీరును ఎండగడుతూ బండి సంజయ్ గారి పాదయాత్ర కొనసాగింది.

బీజేపీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో బండి సంజయ్ కుమార్ చేపట్టిన ‘ప్రజా సంగ్రామ యాత్ర’కు పార్టీ జాతీయ నాయకత్వం సంపూర్ణ సహాయ సహకారాలు అందించింది.. ఇద్దరు మాజీ సీఎంలు (దేవేంద్ర ఫడ్నవీస్, రమణ్ సింగ్) 6 గురు కేంద్ర మంత్రులు పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు. అట్లాగే నలుగురు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, నలుగురు జాతీయ ఉపాధ్యక్షులు, నలుగురు జాతీయ మోర్చాల అధ్యక్షులు, ఇద్దరు జాతీయ కార్యదర్శులు, నలుగురు ఎంపీలు బండి సంజయ్ పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు. వీరుగాక పలువురు కేంద్ర, రాష్ట్రాల మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర, జిల్లా నాయకులు పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ పాదయాత్రకు తొలిరోజు నుండే రాష్ట్ర ప్రజల నుండి మంచి తోడ్పాటే అందింది.. పాదయాత్రలో లక్షలాది మంది ప్రజలను స్వయంగా కలుసుకుని వారి సమస్యలు విన్నారు. బాధలను పంచుకున్నారు. అండగా ఉంటానని భరోసానిచ్చారు.

-Advertisement-బండి‌ సంజయ్ పాదయాత్ర.. తొలిదశకు ఇవాళే ముగింపు

Related Articles

Latest Articles