సీఎం జగన్ తో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి భేటీ

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి భేటీ అయ్యారు. ఇవాళ మధ్యాహ్నం 12.30 కు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన సుబ్రహ్మణ్య స్వామి.. కాసేపటి క్రితమే ఏపీ సీఎం జగన్‌ తో భేటీ అయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో భేటీ అయ్యారు సుబ్రహ్మణ్య స్వామి. ఆధ్యాత్మిక క్షేత్రం టీటీడీ విషయం లో సీఎం జగన్ తీసుకుంటున్న చర్యలను గతంలో ప్రశంసించిన సుబ్రహ్మణ్యం స్వామి… టీటీడీ విషయంలో జరుగుతున్న అసత్య ప్రచారాలపై గతంలో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక నేడు సీఎం జగన్ కలిసిన సుబ్రహ్మణ్య స్వామి… టీటీడీ పరిరక్షణ కోసం తీసుకుంటున్న అన్ని చర్యలపై చర్చించనున్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-