సీఎం జగన్ తో భేటీ కానున్న బీజేపీ ఎంపీ…

ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో భేటీ బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి భేటీ కానున్నారు. ఈ మధ్యాహ్నం 12.30 కు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రానున్నారు సుబ్రహ్మణ్య స్వామి. ఒంటి గంట ప్రాంతంలో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో భేటీ కానున్నారు. ఆధ్యాత్మిక క్షేత్రం టీటీడీ విషయంలో సీఎం జగన్ తీసుకుంటున్న చర్యలను గతంలో ప్రసంశించారు సుబ్రహ్మణ్యం స్వామి. అయితే టీటీడీ విషయంలో జరుగుతున్న అసత్య ప్రచారాలపై గతంలో కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన స్వామి… నేడు సీఎం జగన్ ను కలిసి టీటీడీ పరిరక్షణ కోసం తీసుకుంటున్న అన్ని చర్యలపై సీఎం తో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అక్కడ అందరి దృష్టి టీటీడీ పాలకమండలి సభ్యులు జాబితాపైనే ఉన్న విషయం తెలిసిందే.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-