ప్రధానిని అడ్డుకోవడం రాజకీయ కుట్ర: జీవీఎల్‌

ప్రధానిని అడ్డుకోవడం రాజకీయ కుట్రలో భాగమని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోడీకి రక్షణ కల్పించడంలో విఫలమైందని దీనికి నిరసనగా బీచ్‌రోడ్డు కాళీమాత ఆలయం దగ్గర బీజేపీ ఆధ్వర్యంలో క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించామని తెలిపారు. ర్యాలీలో జీవీఎల్‌ నరసింహారావుతో పాటు ఎమ్మెల్సీ మాధవ్‌ పాల్గొన్నారు. పంజాబ్ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఫల్యాలకు మూల్యం చెల్లించు కుంటుందన్నారు.

Read Also:చేనేతను ప్రొత్సహించడానికి అంగన్‌వాడీలకు చీరలు: కేటీఆర్‌

పంజాబ్ ప్రభుత్వ వైఫల్యం కారణంగానే దేశ ప్రధాని కాన్వాయ్‌ని అడ్డుకున్నారని ఆరోపించారు. రోడ్డెక్కిన వాళ్ళు రైతుల, కాంగ్రెస్ కార్యకర్తల అనేది అక్కడి ప్రభుత్వమే చెప్పాలన్నారు. బహిరంగ సభకు జనం రాకపోవడానికి అది రాహుల్ గాంధీ సభ కాదు…మోదీ మీటింగ్ అని జీవీఎల్‌ అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్‌ ప్రభుత్వం తప్పుడు ప్రచారం మానుకోవాలని జీవీఎల్‌ నరసింహారావు అన్నారు.

Related Articles

Latest Articles