పవన్‌పై కామెంట్లు.. వైసీపీకి జీవీఎల్‌ కౌంటర్

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్, అధికార వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది.. సీఎం వైఎస్‌ జగన్‌, మంత్రులపై పవన్ చేసిన కామెంట్లకు కౌంటర్‌ ఇస్తూ.. తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు.. అదే తరహాలో సోషల్‌ మీడియా వేదికగా ఘాటుగా కౌంటర్‌ ఎటాక్ చేస్తున్నారు జనసేనాని పవన్ కల్యాణ్.. ఇక, తాజాగా ఈ ఎపిసోడ్‌పై స్పందించారు బీజేపీ సీనియర్‌ నేత, ఎంపీ జీవీఎల్‌ నర్సింహారావు.. జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌పై వైసీపీ నాయకుల దుర్భాషలను ట్విట్టర్‌ వేదికగా ఖండించిన ఆయన.. విమర్శ తట్టుకొనే సహనం, సమాధానం చెప్పే బాధ్యత అధికార పార్టీకి ఉండాలని హితవు పలికారు.. నువ్వు ఒకటంటే నేను వంద అంటాను అనే అహంకార తీరు రాజకీయ పతనానికి సూచకం అని కామెంట్‌ చేసిన జీవీఎల్.. తిట్ల తుఫానుకు తెరదించి గులాబ్ తుఫానుపై వైసీపీ శ్రద్ధ పెట్టాలని సూచించారు.

-Advertisement-పవన్‌పై కామెంట్లు.. వైసీపీకి జీవీఎల్‌ కౌంటర్

Related Articles

Latest Articles