సెక్యూరిటీ లేకుండా పాత బస్తీలో తిరుగుతా : బడి సంజయ్

హైదరాబాద్ లో ఉగ్రవాదులు పట్టుబడుతున్నారు. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా ఎంఐఎం రహిత హైద్రాబాద్ కోసం బీజేపీ కి ఓటు వేయాలని అంటే మతతత్వ పార్టీ అన్నారు. ఇప్పుడు నగరం సంఘ విద్రోహ శక్తులకు అడ్డాగా మారింది అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఎవరి ప్రయోజనాల కోసం హోం మినిస్టర్ ఏం చేస్తున్నాడు. రోహింగ్యాలను తరిమి కొట్టడం మతతత్వం అయితే బీజేపీ మతతత్వ పార్టీ నే అన్నారు. బీజేపీ ఎప్పుడు ఇస్లాం, క్రీస్తవాన్ని విమర్శించలేదు. 48 కార్పొరేటర్ లు బీజేపీ గెల్చుకోగానే భయపడి ఢిల్లీకి వెళ్లి అమిత్ షాని కలసి మేయర్ మీకే ఇస్తానని కేసీఆర్ అన్నాడు.. కానీ అమిత్ షా ఒప్పుకోలేదు తెలిపారు.

తెలంగాణ ఆకాంక్షలు నెరవేరలేదు…అవినీతి పెరిగిపోయింది అని అమిత్ షా కేసీఆర్ కి చెప్పాడు. తెలంగాణ లో వచ్చేది బీజేపీ ననే అమిత్ షా కేసీఆర్ కి స్పష్టం చేశాడు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అత్యంత అవినీతి పరుడిగా ముద్రపడ్డ వ్యక్తి కేసీఆర్. పాత బస్తి ఎవరి అయ్యా సొత్తు కాదు. నేను సెక్యూరిటీ లేకుండా పాత బస్తీలో తిరుగుతా అని పేర్కొన్నారు. పాత బస్తి నుండి వెళ్లిపోయిన ప్రజలు తిరిగి అక్కడికి వస్తున్నారు. అధికారం లోకి రాగానే భవ్యమైన,దివ్యమైన భాగ్యలక్ష్మి దేవాలయం ను పునర్నిర్మిస్తాం. అంబెడ్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. గోల్కొండ కోట మీద కాషాయ జండా ఎగురవేయడం లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలి అని అన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-